Chanakya Niti: ఈ 4 పనుల తరువాత స్నానం చేయడం అస్సలు మర్చిపోవద్దు.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు..!

Chanakya Niti: ప్రస్తుత లేజీ కాలంలో ఆచార్య చాణక్యుడి బోధించిన విధానాలు కష్టంగానే అనిపిస్తాయి. అయితే, ఇప్పటికీ చాలా మంది వీటిని ఆచరిస్తుంటారు.

Chanakya Niti: ఈ 4 పనుల తరువాత స్నానం చేయడం అస్సలు మర్చిపోవద్దు.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు..!
Bathing
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2022 | 7:38 AM

Chanakya Niti: ప్రస్తుత లేజీ కాలంలో ఆచార్య చాణక్యుడి బోధించిన విధానాలు కష్టంగానే అనిపిస్తాయి. అయితే, ఇప్పటికీ చాలా మంది వీటిని ఆచరిస్తుంటారు. ఎందుకంటే.. చాణక్య చెప్పిన విలువైన సూత్రాలు పాటించడం ద్వారా జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. జీవన గమనంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు సునాయాసంగా పరిష్కారం కనిపెట్టే సామర్థ్యం సొంతమవుతుంది. ముఖ్యంగా మనిషికి ఆరోగ్యమే పెద్ద సంపద అని చాణక్యుడు పేర్కొన్నాడు. ఒక వ్యక్తి శుద్ధిగా ఎలా ఉండాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలను చాణక్య తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రధానంగా పేర్కొన్న ఆయన.. ఆ నాలుగు పనులు అయ్యాక తప్పనిసరిగా స్నానం చేయాలని తెలిపారు. లేదంటే.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇంతకీ ఆ నాలుగు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దహనం.. శవయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత స్నానం చేయకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. శ్మశాన వాటిక వాతావరణంలో అనేక రకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవి వ్యక్తిపై వాలి.. తనవెంటే పయనిస్తాయి. ఈ నేపథ్యంలో స్నానం చేయకుండా ఉండటం ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. అలాగే, కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే.. దహన సంస్కారాలు చేసిన వెంటనే స్నానం చేయాలి.

నూనెతో మసాజ్.. మంచి చర్మం, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి చాలా మంది ప్రజలు బాడీ మసాజ్ చేసుకుంటారు. అయితే, ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత శరీరం లోపలి వ్యర్థమంతా బయటకు వస్తుంది. అందుకే మసాజ్ చేసిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయకుండా బట్టలు వేసుకుంటే మురికి అంతా మళ్లీ శరీరంలోకి వెళ్లిపోతుంది.

శారీరక సంబంధం.. చాణక్య నీతి ప్రకారం.. స్త్రీ, పురుషు శారీరకంగా ఏకమైన తరువాత స్నానం చేయాలి. శృంగారం శరీరాన్ని అపవిత్రం చేస్తుంది. స్నానం చేయకుండా పూజ, ఇతర కార్యక్రమాలు చేపట్టడం అశుభం అవుతుంది.

హెయిర్ కటింగ్.. జుట్టు కటింగ్ చేయించుకున్న తరువాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్య సూచించారు. ఎందుకంటే.. కటింగ్ తరువాత చిన్న చిన్న వెంట్రుకలు శరీరానికి అతుక్కుపోతాయి. అవి శరీరంలోకి వెళ్లే ఆస్కారం ఉంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడతారు. అందుకే కటింగ్ చేయించిన తరువాత తప్పక స్నానం చేయాలని చాణక్య సూచించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..