ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మౌర్యుల కాలానికి చెందిన చాణక్యుడి విధానాలు, సూచనలు నేటికీ అనుసరణీయమే. అందుకే ఆయనకు అంతటి ప్రాముఖ్యత ఆయకు. ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు, జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి ఇలా ఒకటేమి.. జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చాణక్య వివరించారు. తన నీతిశాస్త్రం గ్రంధంలో ఈ వివరాలన్నింటినీ పేర్కొన్నారు. చాణక్యుడి సూచనలకు నిదర్శనం.. చంద్రగుప్త మౌర్యడు. ఆయన మార్గనిర్దేశంతోనే.. సామాన్యుడైన చంద్రగుప్తుడు యావత్ భారత్ దేశాన్ని ఏలాడు. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
చాణక్యుడు ఒక నాయకుడికి, ఒక మేధావికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా తెలియజేశారు. ఆచార్య ప్రకారం.. తెలివైన వ్యక్తి క్లిష్ట సమయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తారు. డబ్బు అవసరాన్ని గుర్తించి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. అంతేకాదు.. తెలివైన వారికి చాలా లక్షణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తెలివైన వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ప్రజలను ఏలుతారు. ఒక వ్యక్తి తన ప్రవర్తనతోనే ప్రజల మనసును గెలుచుకుంటాడు. వారి ప్రవర్తనే సమాజంలో వారిపై గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాదు.. కష్టసమయాల్లో ప్రజలు సైతం వారికి అండగా నిలుస్తారు. తెలివైన వ్యక్తికి ఉండే మొదటి లక్షణం.. మంచి ప్రవర్తన.
వ్యక్తి జీవితంలో డబ్బు చాలా విలువైనది. డబ్బును అవసరానుగుణంగా వినియోగించడం వల్ల అది రక్షణ ఇస్తుంది. చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కొందరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే.. మరికొందరు డబ్బును దాచుకుంటారు. అయితే, డబ్బును కూడబెట్టడమే కాదు.. సమయం, సందర్భానుసారం ఖర్చు కూడా చేయాలి. డబ్బు ఆదాయంలో ఆదా చేయడంలో ధర్మం ఉంది. అదే సమయంలో డబ్బును ఖర్చు చేయడంలోనూ ధర్మం పాటించాలని సూచిస్తున్నారు చాణక్యుడు.
డబ్బు సంపాపద, మంచి ప్రవర్తనతో పాటు మరో ముఖ్యమైన లక్షణం కూడా అవసరం అంటున్నారు చాణక్యుడు. సమయం ఎవరి కోసం ఎదురుచూడదు. సరైన సమయంలో సరైన పనులు చేయడం అవశ్యం. అందుకే సమయం ప్రాముఖ్యతను గుర్తించి.. దానిని సద్వినియోగం చేసుకోవాలి. కెరీర్‌లో సక్సెస్ సాధించాలంటే ముందుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..