ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. రాజనీతి తెలిసిన వ్యక్తి. చాణుక్యుడు చెప్పిన మాటలు నేటికీ అనుసరించదగినవిగా పరిగణించబడుతున్నాయి. భారతదేశపు గొప్ప రాజకీయ నాయకుడైన చాణక్య తన తెలివితేటలతో ప్రపంచం మొత్తంలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చాణక్యుడు చెప్పిన విషయాలు నేటి ప్రజలు పాటించవచ్చు. వాటిని తమ జీవితాల్లో అన్వయించుకుని జీవింతంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలన్నా.. మంచి మార్గం లో నడవాలన్నా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన అనేక అంశాలు అనుసరణీయం. చాణక్యుడు తన నీతి గ్రంథంలో మనిషిలోని లోపాలను కూడా పేర్కొన్నాడు. వ్యక్తి అభివృద్ధికి ఆటంకాలుగా మారడమే.. ఎంతటి తెలివి గలవారినైనా ఇబ్బంది పెట్టగల మూడు దుర్గుణాలు ఉన్నాయని. వీటిని దూరం చేసుకున్న మనిషి ఎల్లపుడూ సంతోషముగా జీవిస్తాడని.. పేర్కొన్నాడు. ఈరోజు మనిషిలో మూడు చెడు గుణాలు ఏమిటో తెలుసుకుందాం..
అహం
అహంకారం లేదా నేను గొప్ప అనే భావంతో జీవించే వ్యక్తి తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే గొడ్డలితో కొట్టుకుంటాడని చాణక్య విధానం చెబుతోంది. అహంకారంలో మునిగి తేలే వ్యక్తి ఎప్పుడూ కోపంగా ఉంటాడని, అతను తనను తాను అందరికంటే ఎక్కువ అని భావిస్తాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్య విధానం ప్రకారం, పదవి, డబ్బు వంటి సౌకర్యాలు ఈ రోజు ఉంటాయి.. రేపు పోతాయి. వాటి మత్తులో మునిగే వ్యక్తి.. ఈ మత్తులోంచి బయటికి రాగానే పూర్తిగా నాశనమైపోతాడు.
దురాశ
మనమందరం జీవితంలో సంతోషం, సౌకర్యాల కోసం డబ్బు సంపాదించాలి. అంతేకాని డబ్బు సంపాదనే ధ్యేయంగా తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు వ్యర్థాన్ని మాత్రమే ఇస్తుంది. దురాశ ఒక పెద్ద లోపం. క్షణాల్లో జరిగే అభివృద్ధి.. భవిష్యత్తును పాడు చేసుకోవడనికి మార్గం అని అంటారు చాణక్యుడు.
అబద్ధం చెప్పే అలవాటు
అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ప్రజలు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెప్పడం వంటి లోపాలను అలవర్చుకుంటారు. మొదట్లో అంతా బాగానే అనిపించినా నిజం తెరపైకి వచ్చేసరికి ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా దిగజారుతుంది. కనుక అబద్ధం చెప్పే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)