Chanakya Niti: ఒక వ్యక్తి ఈ ఐదు అలవాట్లు ఉంటే డబ్బుల కోసం ఇబ్బంది పడతాడు.. ఈ అలవాట్లను వదిలేయమంటున్న చాణక్య..

|

Jan 26, 2022 | 10:08 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) మంచి రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలను  అనేక శాస్త్రాలుగా లిఖించాడు..

Chanakya Niti: ఒక వ్యక్తి ఈ ఐదు అలవాట్లు ఉంటే డబ్బుల కోసం ఇబ్బంది పడతాడు.. ఈ అలవాట్లను వదిలేయమంటున్న చాణక్య..
Chanakya Niti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) మంచి రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలను  అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. చాణుక్యుడు ఒక వ్యక్తిని నాశనం చేసే ఆ 5 అలవాట్ల గురించి చెప్పాడు. వాటిని వదిలేయడం వలన మనిషికి మేలు చేస్తుందని సూచించాడు. ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేసే ఆ ఐదు అలవాట్లు ఏమిటో చూద్దాం..

*కోపంగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకోలేడు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. పట్టుదలతో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటిని కోల్పోతాడు. అంతేకాదు అటువంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి ఉండడానికి అంతగా ఆసక్తిని చూపించదు. డబ్బుల కొరతతో ఇబ్బంది పడుతుంటారు.

*లక్ష్మి దేవి అనుగ్రహం వల్ల ఎవరికైనా ధనం లభిస్తే దానిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని.. డబ్బుందని అహంకారంతో ఇతరులను కించపరిచే విధంగా ఉంటె అటువంటి వారిపై లక్ష్మిదేవి ఎప్పుడూ కోపంగా ఉంటుంది. దీంతో వారి డబ్బులు పోగొట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టడు.

*సన్మార్గంలో పయనిస్తూ కష్టపడి డబ్బు సంపాదించే వారి పట్ల తల్లి లక్ష్మి ప్రసన్నురాలవుతుంది. అంతేకానీ అత్యాశగల వ్యక్తి ఎప్పుడు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. డబ్బుమీద అత్యాశతో తప్పుడు మార్గాన్ని ఎంచుకునే వారు, ఇతరుల సంపదపై దృష్టి సారిస్తారు, క్రమంగా వారిదగ్గర ఉంది ప్రతిదీ నాశనం అవుతుంది.

*లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడాలి. సోమరి తన సమయాన్ని వృధా చేసుకుంటాడు. అంతేకాదు.. తన దగ్గర ఉన్న ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తాడు.

*డబ్బులను దుర్వినియోగం చేయవద్దు. అవసరమైన వారికి, ఆపన్నులకు సహాయం చేయడం వంటి మంచి పనులకు డబ్బులను ఉపయోగించండి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసే వారి నుంచి లక్ష్మిదూరంగా వెళ్ళిపోతుంది.

Also Read:  నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న వీడియో..