Chanakya Niti: మనిషి పుట్టకముందే కర్మలు బట్టి.. జీవిత విధానం రాసి ఉంటుంది.. వాటిని మార్చలేమంటున్న చాణక్య

|

Jan 30, 2022 | 11:56 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya)  రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా..

Chanakya Niti: మనిషి పుట్టకముందే కర్మలు బట్టి.. జీవిత విధానం రాసి ఉంటుంది.. వాటిని మార్చలేమంటున్న చాణక్య
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya)  రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం..మనిషి జీవితంలో కొన్ని విషయాలు పుట్టకముందే నిర్ణయించబడతాయని ఆచార్య చాణుక్యుడు నమ్మాడు. వీటిని మనం ఎన్నడూ మార్చలేము.. అవి ఏమిటో చాణుక్యుడు తన తన నీతి శాస్త్రంలో చెప్పాడు.. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

*మనిషి చేసిన కొన్ని పనులు జీవితాన్ని విడిచిపెట్టవు. ఆవుల మందలో దూడ తన తల్లిని కనుగొని ఎలా అనుసరిస్తుందో..అదే విధంగా మనిషి చేసిన పనులు వారిని అనుసరిస్తాయి. కర్మ కూడా మనిషిని అనుసరిస్తుందని ఆచార్య చాణక్యుడు విశ్వసించాడు.

*ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి పుట్టక ముందు గత జన్మలో చేసిన కర్మలు బట్టి.. ప్రస్తుత జీవితంలో కొన్ని విషయాలు నిర్ణయించబడతాయని నమ్మాడు. వీటిలో దేనిలోనూ మార్పు ఉండదు.

*మొదటి విషయం ఏమిటంటే, మనిషి వయస్సు.. పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది. దీంతో తన ఆయుష్షు కంటే ఎక్కువ కాలం జీవించలేడు. నిర్ణీత సమయానికి అతడు మరణించాలి. అలాగే మరణం ఎలా వస్తుంది అనేది కూడా ముందే రాసి ఉంటుందని విశ్వసించాడు.

*మనిషి విధి గత కర్మల ప్రకారం నిర్ణయించబడుతుంది. అతని విధిలో ఏది రాసిందో, అతను అంత మాత్రమే పొందగలడు. అదృష్టాన్ని బట్టి మనిషి సుఖ దుఃఖాన్ని పొందుతాడు.

*మనిషికి ఎంత జ్ఞానం , ఎంత డబ్బు ఇవ్వాలనేది కూడా దేవుడు పుట్టడానికి ముందే ప్రతిదీ నిర్ణయిస్తాడని చాణుక్యుడు చెప్పాడు. అయితే దేవుడు మనిషికి పని చేసే శక్తిని ఇచ్చాడు, తద్వారా మనిషి తన అదృష్టాన్ని మెరుగు పరుచుకుంటాడు..  అంతేకాదు రాబోయే జన్మను మేరుగుపరచుకుంటాడు.

Also Read :    అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్..ఆఫీసులకు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..