Chanakya Niti: భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉందా? అయితే, చాణక్య చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

|

Jun 25, 2022 | 12:56 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన మాటలు నేటికీ ఉపయుక్తమే. వ్యక్తి జీవితంలో పాటించాల్సిన జీవిత సత్యాలను..

Chanakya Niti: భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉందా? అయితే, చాణక్య చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Chanakya
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన మాటలు నేటికీ ఉపయుక్తమే. వ్యక్తి జీవితంలో పాటించాల్సిన జీవిత సత్యాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్య. ఆ నీతి శాస్త్రం నుంచి నేర్చుకుని పాటించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితం సాఫీగా సాగాలంటే ఐదు అంశాలను పాటించాలని సూచించారు ఆచార్య చాణక్య. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భార్యాభర్తల మధ్య అనుబంధం: ఆచార్య చాణక్య ప్రకారం ఆనందభరితమైన వైవాహిక జీవితానికి భార్యభర్తలిద్దరూ శారీరకంగా, మానసికంగా సంతృప్తి చెందడం అవసరం. అయితే, భార్యభర్తల మధ్య వయసుల్లో పెద్ద అంతరం ఉంటే.. వారి జీవితంలో ఒడిదుడుకు తలెత్తుతాయని చాణక్య పేర్కొన్నారు. సమస్యలు ఎదురవుతాయని, పెద్ద వయసు ఉన్న పురుషులు, తమకంటే చాలా చిన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి వివాహం అసంబద్ధం అని, వైవాహిక జీవితానికి విషం వంటిదని పేర్కొన్నారు.

సాధన: ఏదైనా పనిలో ప్రావీణ్యం ఉంటే.. దానిలో సమర్థతను కాపాడుకోవడానికి సాధన చాలా అవసరం నొక్కివక్కానించారు ఆచార్య చాణక్య. సాధన చేయకపోతే తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా అవసరమైనప్పుడు దానిని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఏ పని అయినా సాధన తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు ఆచార్య చాణక్య.

వారి కార్యాలకు వెళ్లొద్దు: పేదవారు ఎప్పుడూ ధనవంతుల కార్యాలు, సమావేశాలకు వెళ్లకుండా ఉండాలి. అక్కడి వెళితే మీకు సరైన మర్యాదలు దక్కకపోవచ్చు. వారీ జీవన శైలి, మీ జీవన శైలి అంతరం కారణంగా వారు మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశం ఉందని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం అని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతుల ఫంక్షన్లకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమం అని సూచించారు.

ఫుల్లుగా తినొద్దు: చాణక్య ప్రకారం.. ఇబ్బడిముబ్బడిగా, ఏదిపడితే అది తినకూడదు. మితాహారమే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏదైనా కారణం వల్ల కడుపు నొప్పిగా ఉంటే.. జీర్ణాశయానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు.. ఏమీ తినకుండా ఉంటే ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. నిపుణులను సంప్రదించాలని ఆచార్య చాణక్య పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..