Telugu News Spiritual Chanakya Niti in telugu Such people wander from door to door whole life but they never get anything
Chanakya Niti: ఇటువంటి వారు నిజంగా భూమి భారం.. ఎటువంటి ప్రయోజనం లేదంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) గొప్ప ఆర్ధిక శాస్త్ర వేత్త, వ్యూహకర్త. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు..
Chanakya Neeti
Follow us on
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) గొప్ప ఆర్ధిక శాస్త్ర వేత్త, వ్యూహకర్త. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. ఆయన నీతి శాస్త్రంలో ప్రస్తావించిన అంశాలను విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా నివారించుకోవచ్చు. అవి ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయం. నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. నీతి శాస్త్రంలో ప్రస్తావించిన విధానాలు మిమ్మల్ని అనేక కష్టాల నుండి కాపాడతాయి. అంతేకాదు జీవించే కళను నేర్పుతాయి. జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడే ఆచార్య చెప్పిన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం
జ్ఞానాన్ని పొందని, జ్ఞానంపై ఆసక్తి లేని, తపస్సుతో సంబంధం లేని, దాన ధర్మం ప్రాముఖ్యత తెలియని వ్యక్తులు, సత్ప్రవర్తన, సద్గుణాలకు దూరంగా ఉంటారని ఆచార్య చాణుక్యుడు చెప్పారు. అలాంటి వారి జీవితం వృధా అవుతుంది. బతికున్నంత కాలం భూమి మీద ఇంటింటికీ తిరుగుతారు.. అయితే చనిపోయే వరకు ఏమీ సాధించలేరు. ఇలాంటి ప్రజలు నిజంగా భూమిపై భారమని చాణుక్యుడు చెప్పారు.
పుణ్యం .. ఎటువంటి సమయంలోనూ తన ప్రభావాన్ని కోల్పోదని చాణక్య విశ్వసించారు. బంగారం మురికిలో ఉన్నా దాని విలువ కోల్పోదు..మురికిలో ఉన్నా వెలికి తీయాలి.. అదే విధంగా విషంలో ఉన్న అమృతాన్ని కూడా బయటకు తీయాలని చెప్పారు. అంతేకాదు వ్యక్తి ఎటువంటి కుటుంబంలో పుట్టినా.. విజ్ఞానవంతుడైతే అతని దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించకూడదు.. తక్కువ కులానికి చెందిన అమ్మాయి గొప్ప గుణాలను కలిగి ఉంటే.. ఆమెను స్వీకరించడానికి కూడా వెనుకాడకూడదు.
వ్యక్తి అతిపెద్ద శత్రువు కోపం అని ఆచార్య నమ్మాడు. ఎందుకంటే కోపం వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుంది.. కోపంలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. తనంతట తానుగా వివాదాల్లో చిక్కుకుంటాడు. అందుచేత కోపానికి దూరంగా ఉండాలి.
వృద్ధాప్యంలో తృప్తిగా జీవించాలంటే పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి. కూతురికి మంచి కుటుంబం చూసి పెళ్లి చేసి, పిల్లలను బాగా చదివించాలి. ఎల్లప్పుడూ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి.. ఇలా చేసిన వ్యక్తి జీవితం విజయవంతంగా నడుస్తుంది.
ఎవరైనా స్వంత గుర్తింపును పొందాలనుకుంటే.. ఇతరులపై ఎప్పుడూ ఆధారపడకూడని చెప్పారు. ఇతరులపై ఆధారపడే వ్యక్తులు ఏ పనీ సొంతంగా చేసుకోలేరు. అంతేకాదు అటువంటి వ్యక్తుల విశ్వాసం చాలా బలహీనంగా ఉంటుంది. ఇతరులతో పదే పదే అవమానాలకు గురవుతారు.