Chanakya Niti: ఈ 4 లక్షణాలు పురుషుల కంటే స్త్రీల్లోనే ఎక్కువ.. అందుకే శక్తివంతులు అంటున్న చాణక్య

|

Aug 27, 2024 | 3:33 PM

చాణక్య నీతిలో కూడా స్త్రీ, పురుషుల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ శక్తి వంతమైన గుణాలు ఉంటాయని చెప్పాడు. స్త్రీలు చాలా విషయాలలో పురుషుల కంటే బలంగా ఉంటారు. పురుషులు ఎప్పుడూ తాము శక్తిమంతులమనే భ్రమలో ఉంటారు. చాణక్యుడు పురుషుల కంటే స్త్రీలను శక్తివంతం చేసే 4 లక్షణాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు.

Chanakya Niti: ఈ 4 లక్షణాలు పురుషుల కంటే స్త్రీల్లోనే ఎక్కువ.. అందుకే శక్తివంతులు అంటున్న చాణక్య
Chanakya Niti
Follow us on

స్త్రీ పురుషులలో ఎవరు మంచివారు అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. దీనిపై చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. చాణక్య నీతిలో కూడా స్త్రీ, పురుషుల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ శక్తి వంతమైన గుణాలు ఉంటాయని చెప్పాడు. స్త్రీలు చాలా విషయాలలో పురుషుల కంటే బలంగా ఉంటారు. పురుషులు ఎప్పుడూ తాము శక్తిమంతులమనే భ్రమలో ఉంటారు. చాణక్యుడు పురుషుల కంటే స్త్రీలను శక్తివంతం చేసే 4 లక్షణాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు.

  1. భావోద్వేగాల పరంగా: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు. పురుషులు భావోద్వేగాలపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. అయితే స్త్రీలు ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారు. ఈ గుణాన్ని స్త్రీల బలహీనత అని ప్రజలు అపోహ కలిగి ఉన్నారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు. భావోద్వేగం అనేది స్త్రీల బలం. మహిళలు తమను తాము పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఆశను సులభంగా వదులుకోరు. తమ మనోధైర్యాన్ని కాపాడుకుంటారు.
  2. ఆకలి ఎక్కువ: చాణక్య నీతి ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆకలితో ఉంటారు. మహిళలు ఎక్కువగా తింటారు. దీని కారణం వారి శారీరక నిర్మాణం. స్త్రీలకు ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి కనుక సాధారణంగా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఆహారాన్ని తింటారు.
  3. అవగాహన పరంగా: చాతుర్యం, తెలివితేటల విషయంలో కూడా స్త్రీలకు సాటి ఎవరూ లేరు. స్త్రీలు చాలా విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎటువంటి పరిస్తితి ఎదురైనా మనస్సుతో చురుకుదనంతో ఆలోచిస్తారు. క్లిష్ట పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు.
  4. ధైర్యం విషయంలో: స్త్రీలు తమకంటే బలహీనులన్న భ్రమ పురుషులకు ఉంటుంది. శారీరక బలం పరంగా అలా అనిపించవచ్చు కానీ ధైర్యం విషయానికి వస్తే పురుషుల కంటే స్త్రీలు 6 రెట్లు ఎక్కువ ధైర్యంగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కోవడానికి మహిళలు వెనుకాడరు
  5. ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు