అతిథి దేవో భవ అని మన పెద్దలు చెప్పిన మన జీవన విధానం మాత్రమే కాదు అతిధులకు భారతీయులు ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తల్లిదండ్రులు, గురువు తర్వాత అతిధికి విశిష్ట స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. అతిధిని భగవంతుడి రూపంలో భావిస్తారు. భగవంతుడు ఏ సమయంలో ఏ రూపంలోనైనా వస్తాడని అంటారు. అటువంటి పరిస్థితిలో హిందూ మతంలో అతిథులను గౌరవప్రదంగా భావిస్తారు. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి అతిధిగా ఆహ్వానించవద్దు అని చెప్పాడు. అలాంటి వ్యక్తులను పిలిస్తే రు లాభాల కంటే నష్టాలను చూడవచ్చని చెప్పాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరిని ఇంటికి పిలవకూడదో ఈ రోజు తెలుసుకుందాం..
నెగెటివ్ థింకింగ్: జీవితంలో నెగెటివ్ థింకింగ్ ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలని అంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. సరి కదా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తారు. అలాంటి వారితో స్నేహం చేయకూడదు లేదా వారిని ఇంటికి పిలవకూడదు.
నమ్మకం లేని వ్యక్తి: జీవితంలో చాలా మందిని నమ్మడం కష్టం. ఏదైనా సంబంధం నిలబడడానికి నమ్మకం ఆధారం. ఈ నేపధ్యంలో మీ రిలేషన్‌షిప్‌పై నమ్మకం లేని వ్యక్తులకు మీకు మధ్య మంచి సాన్నిహిత్యం లేదని అర్థం. అటువంటి సంబంధాలు కొనసాగించవద్దు.. అంతేకాదు నమ్మకం లేని వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి పిలవద్దు.
చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు: జీవితంలో చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల నుండి దూరం పాటించాలి. చెడు అలవాట్ల ఉన్న వ్యక్తితో చేసే స్నేహం హానికరం.. క్రమంగా వారి నుంచి చెడు అలవాట్లు నేర్చుకోవడం మొదలు పెడతారు. కనుక చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో పొరపాటున కూడా స్నేహం చేయవద్దు. అంతేకాదు అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించవద్దు అని చాణక్యుడు చెప్పాడు.
అవకాశవాదులు: ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారిలో కొంతమంది అవకాశ వాదులు. వీరు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు. తమ స్వప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో అవకశవాదులు ఇంటికి వచ్చినా అందులో కూడా తమ స్వార్ధాన్ని చూసుకుంటారు. స్వార్థపూరిత సాకును వెదుకుతారు. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్న వ్యక్తుల నుంచి దూరం ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి