Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..

|

Dec 12, 2021 | 7:12 AM

ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి గ్రంధం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇందులో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు..? ఎలా ఆ సమస్యలకు పరిష్కరించుకోవాలి..

Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..
Chanakya
Follow us on

ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి గ్రంధం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇందులో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు..? ఎలా ఆ సమస్యలకు పరిష్కరించుకోవాలి అనే అంశాలను క్లుప్తంగా వివరించాడు. ముఖ్యంగా మానవ సంబంధాల గురించి వివరించారు. సంబంధాల ప్రాముఖ్యత గురించి చెప్పాడు. కటుంబంలో వారి ప్రవర్తన.. పాత పాత్రకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించాడు. భార్య, తోబుట్టువుల త్యాగం తప్పుగా పరిగణించబడని పరిస్థితుల గురించి ఇక్కడ తెలిపాడు.

మతం ఎల్లప్పుడూ మానవత్వాన్ని బోధించేదని ఆచార్య విశ్వసించారు. పరస్పర ప్రేమను నేర్పుతుందని తెలిపాడు. దయ, ప్రేమ ఏ మతానికైనా ఆభరణాలు అని పేర్కొన్నాడు. కానీ ఏ మతం హింసామార్గాన్ని చూపుతుందో దయను ప్రబోధించకుండా తప్పుదారిలో తీసుకెళ్తుందో.. అటువంటి మతాన్ని ఎటువంటి సందేహం లేకుండా వదిలివేయాలిని తెలిపాడు. ఎందుకంటే దయ లేకుండా ఏ మతం మనిషికి సరైన మార్గాన్ని చూపదని వెల్లడించాడు.

భార్యాభర్తల బంధం, కర్తవ్యం గురించి ఇద్దరికీ అవగాహన ఉన్నప్పుడే భార్యాభర్తల సంబంధం ప్రేమగా ముందుకు సాగుతుందని అన్నాడు. చాలా కోపంగా ఉన్న భార్య, ఇంట్లో ఇబ్బందుల వాతావరణాన్ని సృష్టిస్తుందని.. ఇలాంటి సమయంలో భర్త ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని అన్నాడు.

కష్ట సమయాల్లో తోబుట్టువులు ఆసరాగా భావిస్తారు. వారి ప్రేమ, గౌరవం ఇవ్వని సోదరుడు.. మీ దుఃఖాన్ని, సంతోషాన్ని పట్టించుకోని అన్నయ్యను లేదా సోదరిని విడిచిపెట్టడం మేలు. అలాంటి సంబంధాలు భారం తప్ప మరేమీ కాదని చాణక్య నీతిలో సూచిస్తాడు చాణక్యుడు.

శిష్యుని భావితరాలకు గురువే కర్త.. తల్లిదండ్రులతో సమానమైన ఉన్నత స్థానము ఆయనకు లభిస్తుంది. కానీ మీ గురువు అజ్ఞాని అయితే లేదా అతను మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తే.. అతడిని గురువు అని పిలవడానికి అర్హుడు కాదు. అటువంటి గురువును వదులివేయడం మఖ్యం.

ఇవి కూడా చదవండి: Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!