Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉన్నవారిదే విజయం.. ఉంటే వైఫల్యం మీ దరి చేరదంటున్న చాణక్య..

|

Aug 27, 2023 | 9:32 AM

Chanakya Niti: శతాబ్దాల  క్రితం చెప్పిన చాణక్యుడి నీతి సూత్రాలను పాటించి విజయ పథంలో నడుస్తున్నవారు నేటి  సమాజంలోనూ లక్షలాది మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం ఎలా సాధించాలో, అందుకోసం ఏయే లక్షణాలను కలిగి ఉండాలో కూడా వివరించాడు. చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రతి సమస్యను తేలికగా పరిష్కరించగల నేర్పును కలిగి ఉంటాడని తెలిపాడు. ఇంతకీ చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో..

Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉన్నవారిదే విజయం.. ఉంటే వైఫల్యం మీ దరి చేరదంటున్న చాణక్య..
Chanakya Neeti 1
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు అపర మేధావి. ఆర్థిక, రాజకీయ, సామాజిక శాస్త్రం సహా ఎన్నో అంశాల్లో మహా జ్ఞాని. తన విధివిధానాలతో మనషి జీవితంలో ఎదురయ్యే జీవిత, వైవాహిక సమస్యలను ఎలా అధిగమించాలో చక్కగా వివరించాడు. శతాబ్దాల  క్రితం చెప్పిన చాణక్యుడి నీతి సూత్రాలను పాటించి విజయ పథంలో నడుస్తున్నవారు నేటి  సమాజంలోనూ లక్షలాది మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం ఎలా సాధించాలో, అందుకోసం ఏయే లక్షణాలను కలిగి ఉండాలో కూడా వివరించాడు. చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రతి సమస్యను తేలికగా పరిష్కరించగల నేర్పును కలిగి ఉంటాడని తెలిపాడు. ఇంతకీ చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శ్రమించే గుణం: మనిషి అభివృద్ధి సాధించాలంటే శ్రమకు మించిన మరో మార్గం లేదు. అందుకే పెద్దలు కూడా కష్టే ఫలి అన్నారు. ఈ క్రమంలో కష్టించే వ్యక్తి తన శ్రమకు తగిన ఫలితం పొందుతాడు. అలా శ్రమించకుండా ఎక్కడి పనులను అక్కడ వదిలేస్తే.. అన్ని పనులను ఒకేసారి పూర్తి చేయాల్సిన సమయం వస్తుంది. ఫలితంగా సమయం కూడా వృధా అవుతుందని, కష్టపడడమే విజయానికి తొలి మెట్టు అని చాణక్యుడు చెప్పాడు.

ఆత్మ విశ్వాసం: ప్రతి మనిషికి స్వతహాగా కలిగి ఉండే పెద్ద ఆస్తి తనలోని ఆత్మవిశ్వాసం మాత్రమే. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎలాంటి కఠిన పరిస్థితులను అయినా చాకచక్యంగా అధిగమించగలడని, అపజయాలను పొందరని చాణక్యుడు అన్నాడు.

ఇవి కూడా చదవండి

ఆర్జిత జ్ఞానం: సంపాదించిన జ్ఞానం ఎప్పటికీ వృధా కాదు. పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం, కాలక్రమేపీ నేర్చిన జ్ఞానం మానవ జీవితంలో అక్కరకు వస్తాయని చాణక్యుడు చెప్పాడు. అయితే ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నవారే విజయం పొందగలరని చాణక్యుడు అన్నాడు.

సంపాదన: మనిషి మనుగడలో సంపాదన చాలా అవసరం. డబ్బుకు సంపాదనే మార్గం. అయితే చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు అక్కరకు రాదు, అలాగే కష్టించిన సంపాదన కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఇంకా కష్టాలను అధిగమించడంలో మన సంపాదనలే మనకు ఉపయోగపడతాయి.

అప్రమత్తత: జీవితంలో విజయం సాధించాలంటే మనిషిలో ఉండవలసిన మరో గుణం అప్రమత్తత. ఎందుకంటే కష్టం ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియదు, అందువల్ల అప్రమత్తంగా ఉండే వ్యక్తి రానున్న సమస్యల కోసం ముందుగానే సిద్ధంగా ఉంటాడని, వాటిని సులువుగా పరిష్కరించుకోగలుగుతాడని చాణక్యుడు చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..