Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలను ఇతరులతో చెప్పకండి సమస్యలు పెరుగుతాయంటున్న చాణక్య

|

Mar 15, 2023 | 1:16 PM

చాణక్య ప్రకారం మీకు డబ్బు నష్టం వచ్చినా..ఆ  విషయం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇలా చెబితే మీకు సహాయం చేసే వ్యక్తులు మీకు సహాయం చేయడం మానేస్తారు.

Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలను ఇతరులతో చెప్పకండి సమస్యలు పెరుగుతాయంటున్న చాణక్య
Follow us on

విచారంగా ఉన్న వ్యక్తి తరచుగా తన బాధను ఇతరులతో పంచుకుంటాడు. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఒక వ్యక్తి ఎవరితోనూ చర్చించకూడని కొన్ని బాధలు ఉన్నాయి. ఇలా పంచుకోవడం వలన మీ సమస్యలు ఇంకా పెరుగుతాయి

  1. మీరు మీ సంపదను ఎవరికీ ప్రదర్శించకూడదని చాణక్య చెప్పారు. ఇలా చేయడం వలన మీ శ్రేయస్సు అక్కడే నిలిచిపోతుందన్నారు. చాణక్య ప్రకారం మీకు డబ్బు నష్టం వచ్చినా..ఆ  విషయం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇలా చెబితే మీకు సహాయం చేసే వ్యక్తులు మీకు సహాయం చేయడం మానేస్తారు.
  2. మీరు ఏదైనా గురించి ఆందోళన చెందుతుంటే లేదా వ్యక్తిగతంగా ఏదైనా విషయంలో మానసికంగా ఆందోళన చెందుతుంటే, దానిని ఎవరితోనూ చర్చించకుండా ఉండడానికి ప్రయత్నించండి. చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని మీ ఎదుట ఓదార్చుతారు..  మీ వెనుక మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
  3. నష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, భార్య ప్రవర్తన తెలిసినప్పుడు, నీచమైన వ్యక్తి  చెప్పే చెడు మాటలు విన్నప్పుడు,  ఎక్కడైనా అవమానం జరిగినా ఈ విషయాలను పొరపాటున కూడా ఎవరితోనూ ఎప్పుడూ చర్చించవద్దు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
  4. చాణక్యుడి ప్రకారం, మీరు సమాజంలో కొన్ని కారణాల వల్ల అవమానానికి గురైనట్లయితే, ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పకండి. మీరు మీ అవమానాన్ని ప్రస్తావిస్తే, మీ గౌరవం మరింత ప్రభావితమవుతుంది.
  5. మీ భార్య లేదా భర్త ప్రవర్తన సరిగా లేకుంటే లేదా వారి క్యారెక్టర్ గురించి మీకు తెలిస్తే.. ఆ విషయాన్ని మరెవరికీ చెప్పకండి. దానిని మీకే పరిమితం చేసుకోవడానికి.. మనసులో దాచుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి గురించి ఎవరితోనైనా పంచుకుంటే.. ఎప్పుడైనా మీరు సమాజంలో అవమానించబడతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)