Chanakya Niti: వీరిని దూరం పెట్టాల్సిందే.. లేదంటే మీ జీవితమంతా చీకటిమయం..!

| Edited By: Ravi Kiran

Dec 28, 2021 | 7:15 AM

చాణక్య నీతి ప్రకారం, జీవితంలో ఈ మూడు రకాల వ్యక్తులతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు అవకాశం దొరికిన వెంటనే..

Chanakya Niti: వీరిని దూరం పెట్టాల్సిందే.. లేదంటే మీ జీవితమంతా చీకటిమయం..!
Chanakya
Follow us on

Motivation Thought in Telugu, Chanakya Niti: సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, తన చుట్టూ ఉన్న వ్యక్తులను గుర్తించే సామర్థ్యం లేని, లేదా దానిని పట్టించుకోని వ్యక్తులు తమ వినశాన్ని తామే కోరి తెచ్చుకుంటారంట.

భారతదేశంలోని అత్యుత్తమ పండితులలో చాణక్యుడు ఒకడిగా పేరుగాంచారని తెలిసిందే. చాణక్యుడు తన జ్ఞానం, అనుభవం నుంచి తెలుసుకున్నది, అర్థం చేసుకున్న దాన్ని తన చాణక్య నీతి పుస్తకంలో లిఖించాడు. ఆచార్య చాణక్యుడి విధానం నేటికీ వర్తిస్తుంది. చాణక్య నీతి ఒక వ్యక్తిని విజయానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో సుఖ దుఃఖాలకు గల కారణాల గురించి కూడా చెబుతుంది. నేటికీ అధిక సంఖ్యలో ప్రజలు చాణక్య నీతిని అధ్యయనం చేసి తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇదే కారణంగా చెబుతున్నారు.

కొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టాన్ని పూచ్చడం చాలా కష్టం. అందుకే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

స్వార్థపరుల పట్ల జాగ్రత్త: స్వార్థపరులతో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలని చాణక్య నీతి చెబుతోంది. స్వార్థపరుడు ఎప్పుడూ తన లాభం గురించి ఆలోచిస్తాడు. స్వార్థపరుడు తన ప్రయోజనాలను తప్ప ఇతరుల ప్రయోజనాలను పట్టించుకోడు. స్వార్థపరుడు తన లాభం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. చాణక్యుడి ప్రకారం, జీవితంలో అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. వీటిని విశ్వసించకూడదు. ఎందుకంటే అలాంటి వారు అవకాశం దొరికిన వెంటనే తమ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మోసం చేసే అవకాశం ఉంటుంది.

కోపంతో ఉన్న వ్యక్తికి దూరం: కోపంతో ఉన్న వ్యక్తి, ఆయుధాలను కలిగి ఉన్నవాడితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. వీటిని పట్టించుకోని వారు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పొగిడేవారికి దూరం: ఎప్పుడూ మీ ముఖం మీద పొగిడేవారికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. తమ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం, ముఖం మీద పొగిడే వారు, వెనుక చెడు చేసేవారు, అలాంటి వ్యక్తులను విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తులను శ్రేయోభిలాషులుగా భావించకూడదని చాణక్యనీతి చెబుతోంది.

Also Read: Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి..

Vastu Tips: కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే 5 వాస్తు చిట్కాలు..! ఏంటో తెలుసుకోండి..?