ఈ రోజు చైత్ర మాసంలో చివరి రోజు అమావాస్య. ఈ అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. చిత్ర మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య తేదీని చైత్ర అమావాస్యగా జరుపుకుంటారు. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతే కాదు బ్రాహ్మణులకు పితృ తర్పణం, పిండ ప్రదానం, హవనం, అన్నదానం చేసి పూర్వీకుల ఆశీస్సులు పొంది వారికి శాంతి చేకూర్చే సంప్రదాయం ఉంది.
అంతేకాదు ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
చైత్ర మాస అమావాస్య 2024
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధి మంగళవారం మే 7, ఉదయం 11:40 గంటలకు ప్రారంభమై.. ఈ రోజు బుధవారం, మే 8 ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ రోజు (మే 8వ తేదీ) బుధవారం అమావాస్య పూజధికార్యక్రమాలను నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు