Buddha Purnima 2021: బుద్ధ పౌర్ణమి తేదీ, శుభ ముహుర్తం.. వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత వివరాలు..

|

May 25, 2021 | 11:14 AM

Buddha Purnima 2021:  వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను

Buddha Purnima 2021: బుద్ధ పౌర్ణమి తేదీ, శుభ ముహుర్తం.. వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత వివరాలు..
Buddha Purnima
Follow us on

Buddha Purnima 2021:  వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు.  ఈరోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. బుద్దుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది.  భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది.  మే 26న బుద్ద పౌర్ణమి.

శుభ సమయం..
బుద్ధ పూర్ణిమ తేదీ మే 26 బుధవారం..
పూర్ణిమ తిథి ప్రారంభమైంది.. మే 25న 8.29pm
పూర్ణిమ తిథి ముగిసే సమయం.. మే 26న 4.43 pm

ప్రాముఖ్యత..
భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

Also Read: Narasimha Jayanti 2021: నరసింహ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈరోజున ఉన్న ప్రత్యేకత ఎంటంటే..

మొఘల్ చక్రవర్తి అక్బర్ కారణంగానే హనుమాన్ చాలీసా రాశారా ? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా..

Vastu Tips: ఇంటి కిటికీలను తయారు చేసేటప్పుడు ఈ పద్ధతులను పాటిస్తే.. ఆర్థికంగా.. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయట..