Hanuman Birth Place: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో హనుమంతుని జన్మస్థలం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హనుమంతుని జన్మ స్థలంగా అంజనాద్రిని ప్రకటించే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అంజనాద్రి అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా బదులిచ్చారు. అయితే, అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఇప్పటిక ప్రకటించింది. దానికి సంబంధించి నివేదికను రూపొందించి.. దాని ఆధారంగా ఒక బుక్‌లెట్‌ని విడుదల చేసింది.
అయితే, టీటీడీ చేసిన ఈ ప్రకటనపై కర్ణాటకకు చెందిన హంపి హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించడంపై టీటీడీ వైఖరిని తప్పుపట్టింది. అంజనాద్రి వాదనలో నిజం లేదని ఆరోపించింది. అయితే, హంపి హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన ఆరోపణలకు టీటీడీ కౌంటర్ కూడా ఇచ్చింది. అన్నీ పరిశోధనలు జరిపిన తరువాతే అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా తీర్మానించామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ వివాదం ఇలా సాగుతుండగానే కేంద్రం నుంచి వెలువడిన ప్రకటన.. హనుమంతుని జన్మస్థలం వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది.
Also read:
Suicide: విజయవాడలో దారుణం.. భర్త వేధింపులు తాళలేక మహిళ హోంగార్డ్ ఆత్మహత్య..
AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద నీరు..