
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటాను నేడు(గురువారం18) ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది..ఇవాళ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డిసెంబర్ నెలలో రోజూ వారి దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇందులో భాగంగా తిరుమలలో అంగప్రదక్షిణ, వసతి, వర్చువల్ సేవా టికెట్లు, శ్రీవాణి తోపాటు వృద్ధుల దర్శనం కోటా షెడ్యూలును టీటీడీ వెల్లడించింది. ఆ వివరాలు ఇవి.
*ఆర్జిత సేవా టికెట్లు:
– తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
– లక్కీడిప్ రిజిస్ట్రేషన్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
– అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే యాత్రికులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ స్టష్పం చేసింది.
– కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 22న, వర్చువల్ సేవలు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి.
– శ్రీవాణి ట్రస్టు దర్శనం 23న ఉదయం, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శనం 23న మధ్యాహ్నం, ప్రత్యేక ప్రవేశ దర్శనం 24న ఉదయం, గదుల కోటా 24న మధ్యాహ్నం విడుదల అవుతాయి.
ఇకపోతే, గదుల కోటాకు సంబంధించి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి గదుల కోటా కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది టీటీడీ. తిరుమల తోపాటు తిరుపతిలో కూడా వసతి టీటీడీ గదుల కోసం సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..