Bhishma Niti: దేశాన్నే పాలకులకుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పిన భీష్ముడు.. ఇటువంటి రాజు పాలనలో ఉన్న ప్రజలు అదృష్టవంతులట

సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా మహాభారతంలో భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదకి చేరుకుని పుణ్యకాలం కోసం ఎదురుచోస్తున్నాడు. ఈ సమయంలో పాండవులకు రాజ్యపాల గురించి అనేక విషయాలను చెప్పాడు. భీష్ముడు ధర్మరాజుకి పాలకుడి ఉండాల్సిన లక్షణాలను వివరించాడు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Bhishma Niti: దేశాన్నే పాలకులకుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పిన భీష్ముడు.. ఇటువంటి రాజు పాలనలో ఉన్న ప్రజలు అదృష్టవంతులట
Bhishma Niti

Updated on: Jun 05, 2025 | 2:56 PM

మహాభారతంలో శంతన మహారాజు, గంగాదేవిల తనయుడు దేవవ్రతుడు.. తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాలకోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, తన జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు అని సత్యవతికి వాగ్దానం చేసి, భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన భీష్ముడయ్యాడయ్యాడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ వేచి ఉన్నాడు. ఇలా అంపశయ్య మీద ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మ రాజుకి రాజనీతిలోని సారాంశం భోదించాడు. ఈ రోజు భీష్ముడు చెప్పిన పాలకుడి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

  1. భీష్ముడు యుధిష్ఠిరుడికి రాజ్య పాలన చేసే సమయంలో రాజు ప్రవర్తన ఎలా ఉండాలనేది చెప్పాడు. రాజుకు ఎనిమిది మంది సలహాదారులు ఉండాలని.. వారిలో నలుగురు వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణులు, తమ పనిలో నిష్ణాతులైన ముగ్గురు శూద్రులు. ఒక వృద్ధుడు, పండితుడు అయిన సూతుడు ఉండాలని చెప్పాడు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాజు ఈ ఎనిమిది మంది సలహాదారులను సంప్రదించాలని.. తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు.
  2. ఎప్పుడైనా వివాదాలను పరిష్కరించాల్సి వస్తే.. తీర్పు ఇచ్చే ముందు రాజు తప్పనిసరిగా ఎక్కువ మంది సాక్షులను విచారించాలి. రాజు పుకార్ల ఆధారంగా శిక్ష విధించకూడదు. చేసిన నేరానికి తగిన విధంగా శిక్ష విధించాలి. ధనవంతులకు భారీ జరిమానాలు విధించాలి. ఇతరులకు జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించాలి. రాజును చంపడానికి ప్రయత్నించే వారికి ఉరి శిక్ష విధించాలి.
  3. రాజు తెలివైన, సమర్థుడైన, పరాక్రమవంతుడైన.. యుద్ధం చేసే విధానం గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్నారినే సైన్యాధ్యక్షుడిగా నియమించుకోవాలి. రాజు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.
  4. రాజు ఉండే నగరంలో కోటలు, ధాన్యాగారం, ఆయుధాలతో కూడిన ఆయుధశాల ఉండాలి. రాజు తప్పనిసరిగా ప్రవర్తనా నియమాలను అనుసరించాలి. ఇళ్ళు విశాలంగా ఉండాలి. నగరంలో ఎప్పుడూ బ్రాహ్మణుల సంకీర్తనలు వినిపిస్తూ ఉండాలి. రాజ్యంలో నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు ఉండాలి. తన ప్రజలకు ఎప్పటికీ నీటి ఎద్దడి రాకుండా రాజు తగిన నీరు వనరుల సదుపాయాన్ని కల్పించాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. తన రాజ్యంలో రక్షణ అవసరం అయిన వారిని అంటే భర్తని పోగొట్టుకున్న అబలను, వృద్ధులను, వికలాంగులను జాగ్రత్తగా చూసుకోవాలి. సన్యాసులను గౌరవించాలి. వారు చెప్పే సలహాలను వినాలి. ప్రతి గ్రామానికి ఒక అధిపతిని ఏర్పాటు చేయాలి. ధర్మం తెలిసిన వ్యక్తులను కొన్ని గ్రామాలను కలిపి పర్యవేక్షించే భాద్యతను అప్పగించాలి.
  7. రాజు దయగలవాడై ఉండాలి. చేసిన పనుల ఆధారం ప్రజలకు పన్నులు విధించాలి. ఆ పన్నుల గురించి ప్రజలకు ముందుగానే తెలియజేయాలి. అదే సమయంలో రాజ్యం అభివృద్ధి చెందినప్పుడు ప్రజలపై వేసిన పన్నులు తగ్గించాలి.
  8. రాజు అంటే భయం కూడా ఉండాలి. ఎప్పుడైనా విపత్తు ఏర్పడితే.. ప్రజల నుంచి సంపదను స్వాధీనం చేసుకుని అందరి మంచి కోసం ఉపయోగించాలి. రాజ్యంలో మద్యపాన గృహాలు, వ్యభిచార గృహాలు, జూద స్థావరాలను పరిమితం చేయాలి. భిక్షాటనకు అనుమతించకూడదు. దొంగలు లేకుండా చూసుకోవాలి. ప్రజలు చేసే ధర్మంలో నాల్గవ వంతును .. వారి పాపాల్లో నాల్గవ వంతును రాజు పొందుతాడు.
  9. పండ్లు, పువ్వులు ఉన్న చెట్లను ఎప్పుడూ నరకకూడదు. పండితుడైన బ్రాహ్మణుడిని తక్కువ చేసి మాట్లాడవద్దు. రాజు తన పరిపాలన, తన విధానాలు ప్రజలకు నచ్చాయో లేదో.. తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి గూఢచారులను నియమించాలి. వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. ప్రజల ఆలోచనలు అనుగుణంగా తన తప్పుఒప్పులను సరిచేసుకోవాలి.
  10. రాజు ధర్మాన్ని ఆచరించి తన రాజ్యంలోని జీవులను రక్షించినప్పుడు, రాజ్యంలో మంచి వర్షాలు కురుస్తాయి. రాజు తప్పు చేసింది తన కొడుకు అయినా శిక్షించాలి. ఎవరినా బాధలో ఉంటే వారి కన్నీరు తుడిచి సాయం అందించాలి. రాజుకి ప్రజలే బిడ్డలు అనే ధర్మాన్ని పాటించలి.
  11. రాజుకు తెలివైన సలహాదారులు, రాజ్యం శ్రేయస్సు కోరుకుంటూ.. రాజుని ప్రేమించే పౌరులు ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకునే రాజు మాత్రమే ప్రజల మనసుని మాత్రమే కాదు ప్రపంచాన్నే జయిస్తాడు.
  12. అధర్మం ద్వారా సంపాదించిన ఏ విజయం అయినా వ్యర్థం. యుద్ధం ద్వారా సంపాదించిన ఎటువంటి సంపదనైనా, లేదా కన్యను ఒక సంవత్సరం పాటు ముట్టుకోకూడదు. యుద్ధంలో చంపే రాజు.. యజ్ఞాలు, దానధర్మాలను చేయడం ద్వారా పవిత్రుడవుతాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు