Lakshmi Narasimha Swamy Kalyanam: తూర్పు గోదావరి జిల్లా(East Godavari District)లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అంతర్వేది(Antarvedi)లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి(Bhishma Ekadashi) రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవమును నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి కళ్యాణికి ఘనంగా ఏర్పాట్లు చేసింది. లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం ఈరోజు (శుక్రవారం) రాత్రి 12:35 ని.లకు తెల్లవారితే స్థిరవారం రోజున జరపనున్నారు. వేదం మంత్రాల నడుమ జరిగే స్వామివారి కళ్యాణం ఉత్సవాన్ని చూడడానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాదు.. రాష్ట్రము నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
శుక్రవారం నుంచి ఆలయంలో కల్యాణోత్సవాలు జరుగుతాయి. శనివారం రోజున మధ్యాహ్నం 2:35 ని.లకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కన్నుల పండువగా సాగే రథోత్సవాన్ని చూడడానికి భారీగా భక్తులు హాజరవుతారు, అయితే 60 ఏండ్ల క్రితం టేకుతో 40 అడుగుల ఎత్తున్న రథం షెడ్డులో భద్రపరగా అది దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి గత ఏడాది రథోత్సవ సమయంలో కొత్త రథాన్ని చేయించింది. కోటి రూపాయల వ్యయంతో నూతన రథాన్ని నిర్మించి స్వామి కళ్యాణం అనంతరం జరిగే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తీర్ధ మహోత్సవములకు విచ్చేయుచున్న భక్తులకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. స్వామి వారి కళ్యాణ మహత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా APSRTS అన్ని ఏర్పాట్లు చేశారు ఈరోజు, రేపు ఆయా రూట్లలో 100 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. అమలాపురం నుంచి 20, రాజోలు నుంచి 35, రావులపాలెం నుంచి 5 నడపనున్నారు. అమలాపురం – మలికిపురం 15, అప్పనపల్లి-మలికిపురం 5, రావులపాలెం-మలికిపురం 5 బస్సులు నడపనున్నారు.
Also Read: