Ayodhya Ram Mandir: అంతా రామమయం.. అయోధ్యలో రేపటినుంచే ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు.. ఆసక్తికర విషయాలు మీకోసం..

ఈనెల 18న బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు.. కర్నాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ రామ్‌లల్లా విగ్రహాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని గర్భగుడికి చేర్చి పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్‌లల్లా నేత్రాలంకరణలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు. ముహుర్తం ప్రకారం ఈ నెల 22 మధ్యాహ్నం రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట జరుగుతుంది.

Ayodhya Ram Mandir: అంతా రామమయం.. అయోధ్యలో రేపటినుంచే ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Ayodhya Ram Mandir

Updated on: Jan 15, 2024 | 6:10 PM

Ayodhya Ram Mandir : జనవరి 22.. సోమవారం. అయోధ్యలో రాములోరి వేడుక.. మధ్యాహ్నాం పన్నెండున్నరకు దివ్య ముహుర్తం.. గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట మహోత్సవం.. సర్వం సిద్ధం.. సకలం రామమయం.. జనవరి 16నుంచి అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ ఆధ్మాత్మిక వేత గణేష్‌శాస్త్రి ద్రావిడ్‌ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 18న బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు.. కర్నాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ రామ్‌లల్లా విగ్రహాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని గర్భగుడికి చేర్చి పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్‌లల్లా నేత్రాలంకరణలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు. ముహుర్తం ప్రకారం ఈ నెల 22 మధ్యాహ్నం రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట జరుగుతుంది.

  1. అయితే, రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఇంకా ఒకే వారం మిగిలి ఉంది. ఆలయం లోపల పనులు ఎలా సాగుతున్నాయో చాటుతూ, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫొటోలు విడుదల చేసింది. రాముడి భవ్య మందిరంలో పనులు ఎలా సాగుతున్నయో చెప్పే ఫొటోలు ఇవి. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.
  2. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ట పూర్తి కాగానే మరుసటి రోజు నుంచే సామాన్యులకు దర్శనం ఉంటుందని ప్రకటించారు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, నృత్య గోపాల్ జీ మహరాజ్ సహా 150 మందికి పైగా సాధువులు, వివిధ రంగాలకు చెందినవారిని ఆహ్వనించామని తెలిపారు
  3. అయోధ్యలో ధర్మశాస్త్రం ప్రకారం ఏర్పాట్లు జరగాలన్నదే తమ అభిమతమని, ప్రాణప్రతిష్టపై ఎలాంటి వివాదం లేదన్నారు శారదాపీఠ శంకరాచార్యులు జగద్గురు సదానంద సరస్వతి.. ఈ కార్యక్రమం తర్వాత నలుగురు శంకరాచార్యులు వెళ్లి దర్శనం చేసుకుంటారని తెలిపారాయన.
  4. శ్రీరామచంద్రుడిపై ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ భక్తిని చాటుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ ఏకంగా 108 అడుగుల పొడవైన అగర్ బత్తి తయారుచేసి అయోధ్యకు తరలించింది. ప్రస్తుతం అయోధ్య ధామ్ బస్ స్టేషన్ లో ఉన్న ఈ అగర్‌బత్తీ అందరినీ ఆకట్టుకుంటోంది.
  5. శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరంలో పర్యావరణాన్ని సైతం పరిశుభ్రంగా ఉంచే ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొడుతున్నాయి. తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులు, 25 ఈ ఆటో రిక్షాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రారంభించారు.
  6. ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖులు, కళాకారులకు ఆతిథ్యమిచ్చేందుకు ఉత్తర ప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక టెంట్ సిటీ నే నిర్మిస్తోంది. స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసుకొని సకల సదుపాయాలను అక్కడ కల్పిస్తోంది. ఈ లగ్జరీ టెంట్ సిటీ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
  7. రామమందిరం కోసం తయారు చేసిన 14 బంగారు ద్వారాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ తలుపులు వేయి సంవత్సరాల వరకూ చెక్కు చదరవని తెలిపారు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని శరద్ బాబు. చాలా తక్కువ సమయంలో ఛాలెంజ్‌గా తీసుకొని ఈ ద్వారాలను తయారు చేశామని టీవీ9తో తెలిపారు.
  8. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి ఏకంగా ఐదు లక్షల లడ్డూలు తరలి వెళుతున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్‌ CM మోహన్‌ యాదవ్‌ పర్యవేక్షించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..