మహాభారతం గురించి తెలిసిన వారందరికీ అశ్వత్థామ హతః కుంజరః అనే పదం గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. పాండవులు, కౌరవుల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ద్రోణాచార్యుడిని అడ్డగించడం కోసం అశ్వత్థామ హతః అని ధర్మరాజు గట్టిగా అంటాడు. ఆ తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. జగన్నాథుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇదంతా చేయిస్తాడు. వాస్తవానికి యుద్ధంతో చనిపోయింది అశ్వత్థాముడు కాదు. అశ్వత్థామ అనే పేరు కనిగిన ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా ధృష్ట్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ని అంతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తాడు. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తోన్న ప్రాంతంపై దాడి చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకువెళ్తాడు. అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా ప్రాణాలు కోల్పోతుంది.
అశ్వత్థాముడు బ్రహ్మాస్తాన్ని ప్రయోగించగా.. అర్జునుడు పాశుపతాస్త్రం ఉపయోగిస్తాడు. ఈ ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్తాన్ని ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. దీంతో కృష్ణుడు కోపంతో అశ్వత్థాముడిని శపిస్తాడు. కుష్టు వ్యాధితో 3 వేల ఏళ్లపాటు ఒంటరిగా బతకమని చెప్పి వెళ్లిపోతాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము, నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారం ఉంది.
అయితే.. అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని బలంగా నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ అయితే ఆయన తనకు కనిపించినట్లు చెప్పాడు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..