Astrology Tips: శత్రువుపై విజయాన్ని సాధించడానికి, కష్టాలు తొలగడానికి ఈ నివారణ చర్యలు తీసుకోండి..

|

Jun 10, 2023 | 10:24 AM

మీ జీవితంలో ఏదైనా శత్రువు లేదా శత్రువుతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వీలైనంత త్వరగా శత్రుత్వాన్ని వదిలించుకోవాలను భావిస్తారు. కనుక హిందూ మతంలో కొన్ని చర్యలు సూచించారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

Astrology Tips: శత్రువుపై విజయాన్ని సాధించడానికి, కష్టాలు తొలగడానికి ఈ నివారణ చర్యలు తీసుకోండి..
Lord Hanuman
Follow us on

జీవితంలో చాలా సార్లు ఇష్టం లేకపోయినా సరే తప్పని సరి పరిస్థితుల్లో ఎవరితోనైనా లేదా మరొకరితో వాగ్వాదానికి దిగుతారు. అది క్రమంగా శత్రుత్వంగా మారుతుంది. జీవితంలో ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడితే ఆ వ్యక్తి మనశాంతి దూరం అవుతుంది. శత్రువు ప్రణాళికాబద్ధంగా మీ పనిని అడ్డుకుంటూ.. మిమ్మల్ని నాశనం చేసే దిశగా అడుగులు వేస్తారు. తత్ఫలితంగా తన శత్రువు కదలికలను అడ్డుకోవడంలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటాడు. తన సొంత పురోగతిపై తక్కువ శ్రద్ధ చూపుతాడు. మీ జీవితంలో ఏదైనా శత్రువు లేదా శత్రువుతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వీలైనంత త్వరగా శత్రుత్వాన్ని వదిలించుకోవాలను భావిస్తారు. కనుక హిందూ మతంలో కొన్ని చర్యలు సూచించారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

ఎటువంటి శత్రువుపైన అయినా విజయాన్ని ఇచ్చే మంత్రం.. 

హిందూ మతంలో మంత్రాలను పఠించడం ఏదైనా కోరికను నెరవేర్చడానికి చాలా ప్రభావవంతంగా, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటప్పుడు శత్రుబాధలను తొలగించి, వాటిని అధిగమించడానికి శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. – ‘
ఓం హూం ఝుఁ సః ఓం భూర్భువః స్వః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||’ లేదా

ఇవి కూడా చదవండి

బగళాముఖీ దేవి మంత్రం ‘ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ, జిహ్వం వాన్ కీలయ, బుద్ధి వినాశాయ, హ్రీం ఓం స్వాహా’ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాలతో పాటు, మీరు కోరుకుంటే, ‘ఓం నృసింహాయ శత్రు భుజ బల విదుర్ నాయ స్వాహా’ అనే నారసింహుని మంత్రాన్ని జపించడం ద్వారా కూడా శత్రు బాధలనుంచి బయటపడవచ్చు.

సంకట్ మోచన్ ఆరాధనతో శత్రువుల నుండి విముక్తి.. 

సనాతన సంప్రదాయంలో వాయు కుమారుడైన హనుమంతుడిని సంకట్ మోచనుడు అని పిలుస్తారు.  ఎందుకంటే తనను నిర్మలమైన హృదయంతో స్మరించిన భక్తుని సహాయం కోసం పరిగెత్తాడని విశ్వాసం.  హిందూ విశ్వాసం ప్రకారం ఏ భక్తుడు ప్రతిరోజూ బజరంగ్ బాన్ పఠిస్తే.. హనుమంతుడు ఆశీర్వాదాలు కురిపిస్తాడని విశ్వాసం. అతనికి ఏ శత్రువు కూడా హాని చేయలేడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).