Zodiac Sign: రాశిచక్రం ప్రకారం ప్రతి వ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఎలాంటి బలాలు, లోపాలు ఉన్నాయనేది.. వారి రాశిచక్రంలో ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రాశిచక్రం దాని స్వంత యోగ్యతలను, దోషాలను కలిగి ఉన్నట్లుగానే.. ఆ రాశిచక్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. దీని ప్రకారం.. వృషభరాశి వారి గుణాలేంటి? ఇతర రాశిచక్రాల వారికి వీరి మధ్య ఉండే తేడాలేంటి? వారి వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే ప్రతికూల అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి వారిలో లక్షణాలు..
వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి, సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు.
వృషభరాశి వారి స్వభావం, వ్యక్తిత్వం..
వృషభరాశి వారు చాలా ప్రశాంతచిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాధిస్తారు. అంతేకాదు.. వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే, ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు.
వృషభ రాశి వారి ఆరోగ్యం..
వృషభరాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే, కొంతమంది తమ జీవితాంతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు లైంగిక బలహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు కిడ్నీ, మెడ, గొంతు సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వృషభ రాశి వారిలో ఎక్కువ శాతం మంది పొట్టివారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు.
వృషభ రాశి వారి లోపాలు..
వృషభ రాశి వారు కొన్ని సంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వీరు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా.. కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనుకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. అదే సమయంలో ఈ రాశి వారు చాలా మొండివారు కూడా.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..