Astro Tips: చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుందా.. గ్రహ ప్రభావం కావొచ్చు.. పరిహారాలు ఏమిటంటే..

కోపం మనిషికి అతిపెద్ద శత్రువని పెద్దలు చెప్పారు. కోపంతో ఉన్న సమయంలో తీసుకునే నిర్ణయాలు ఫలవంతం కావని.. ఆలోచనలు నియంత్రణలో ఉండవు. ఈ విషయం అందరికీ తెలుసు.. కానీ కొంతమంది తమ కోపాన్ని నియంత్రించుకాలేరు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. దీనికి కారణం గ్రహాల ప్రభావం కూడా కావచ్చు. కనుక ఈ రోజు కోపం నియత్రించుకునేందుకు చేయాల్సిన జ్యోతిష్య నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

Astro Tips: చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుందా.. గ్రహ ప్రభావం కావొచ్చు.. పరిహారాలు ఏమిటంటే..
Astro Tips

Updated on: Jul 10, 2025 | 7:10 PM

చాలా మంది చిన్న చిన్న విషయాలకే బాధపడటం, కోపం తెచ్చుకోవడం, చిరాకు పడటం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కొంతమందికి కోపం వారి ముక్కు మీదే ఉంటుంది. కొన్నిసార్లు ఈ కోపం కారణంగా తమ సంబంధాలను కూడా పాడు చేసుకుంటారు. మొత్తం మీద ఈ కోపంమనిషికి అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఇలా కోపం రావడానికి కారణం జాతకంలోని గ్రహాలు కూడా కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో జాతకాన్ని చూపించడం ముఖ్యం. అయితే కోపం అదుపు తప్పడం అంగారక గ్రహం ప్రభావం వలన జరుగుతుంది. కోపం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అంతేకాదు కోపం సామాజిక, మానసిక జీవితంపై కూడా ప్రభావితం చేస్తుంది.

కోపానికి కారణమైన గ్రహాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కోపానికి ప్రధానంగా కుజుడు. సూర్యుడు, శని, రాహువు, చంద్రులు కారణమవుతారు. కోపం అదుపులేని స్థితికి చేరుకుంటే మీపై కుజుడు ప్రభావం ఉందని అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడూ అహంకారంతో కోపంగా ఉంటే.. అది సూర్యుని ప్రభావం వల్ల కూడా కావచ్చు. మీ కోపంతో చాలా ఇబ్బంది పడుతుంటే.. అది మీ మానసిక స్థితిని ప్రభావితం చేయడం ప్రారంభించినట్లయితే.. అది చంద్రుని కారకం కూడా కావచ్చు. చంద్రునిచే ప్రభావితమైన వ్యక్తి కోపంతో పాటు ఎక్కువగా చిరాకు పడతాడు. చిన్న విషయాలకే కలత చెందుతాడు. రాహువు, శనీశ్వరుడు కూడా కోపం, మానసిక రుగ్మతలకు దారితీసే ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తారు. అయితే ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవడానికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..

కోపాన్ని తగ్గించుకోవడానికి జ్యోతిష పరిహారాలు

ముందుగా ఉదయం అలవాట్లను మార్చుకోవాలి. అంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం వ్యాయామం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. తర్వాత భూదేవికి నమస్కరించి.. మీ అరచేతులను చూసుకుని తద్వారా రోజుని ప్రారంభించండి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ఎల్లప్పుడూ సువాసన ఉండేలా చర్యలు తీసుకోండి. పూజ గదిలో అయినా లేదా పడకగదిలో అయినా వీలైతే గంధపు సుగంధ ద్రవ్యం లేదా ఏదైనా అగరుబత్తిని వెలిగించండి. ఇంట్లో సుగంధ ద్రవ్యాలు, కర్పూరం సువాసన కూడా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ చర్య కోపాన్ని శాంతపరుస్తుంది. రాహు, చంద్ర దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కోపంగా ఉన్న వ్యక్తి ప్రతి రాత్రి చంద్రుడికి అర్ఘ్యం అర్పించిన తర్వాత నిద్రపోవాలి. ఇది చంద్రుడిని ప్రశాంతపరుస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కోపంగా ఉండే వ్యక్తి ఇంట్లో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది మీ గ్రహాల స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ, ప్రతికూలత మీలోకి ప్రవేశించవు.

పూజా స్థలంలో దీపం వెలిగించండి. వీలైతే ఉదయం, సాయంత్రం రెండు సమయంలో ఇలా చేయండి. మీరు ఇలా దీపాలను వెలిగించడం వీలు కాకపోతే ఇంట్లో ఎప్పుడైనా దీపం వెలిగించండి.

ఎవరైనా చాలా కోపంగా ఉండి కోపంలో ఉక్కిరిబిక్కిరి అవుతుందే అలాంటి వ్యక్తిపై కుజుడు ప్రభావం ఉన్నట్లు. అటువంటి సందర్భంలో ఎరుపు రంగు వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు బెడ్‌షీట్లు లేదా ఎరుపు రంగు కర్టెన్లను ఉపయోగించవద్దు.

చేతికి వెండి బ్రాస్లెట్ లేదా మీ మెడలో వెండి గొలుసు ధరించండి. వెండి ఎల్లప్పుడూ చల్లదనాన్ని అందిస్తుంది . మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీలైతే మీరు ధరించే గొలుసుపై ఒక చిన్న వెండి చంద్ర యంత్రాన్ని కూడా ఉంచవచ్చు లేదా మీతో వెండి యంత్రాన్ని ఉంచుకోవచ్చు.

కోపంగా ఉన్నవారు తమ తినే ఆహారంలో పాలు పెరుగుని ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంతో పాటు కొద్దిగా పెరుగు , చక్కెర తినడం వల్ల చంద్రుడు బలపడతాడు.

నిజానికి ఎవరి జన్మ జాతకంలోనైనా చంద్రుడు, కుజుడు మధ్య సామరస్యం లేకపోతే.. ఆ వ్యక్తి ఎక్కువగా కోపంగా ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది. అలాంటి సందర్భంలో జాతకాన్ని చూపించడం చాలా ముఖ్యం.

అయితే కుజుడి అనుగ్రహం కోసం మెడలో ఎర్రటి పగడాన్ని లేదా గణేశుడి ఆకారంలో అచ్చు వేయబడిన ఎర్రటి పగడాన్ని ధరించవచ్చు. ఇది మీ కుజుడిని ప్రశాంతపరుస్తుంది.

కోపంగా ఉన్న వ్యక్తి హనుమంతుడిని పూజించడం చాలా ప్రయోజనకరం. వీలైతే ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించండి లేదా హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి.

గాయత్రీ మంత్రాన్ని ధ్యానం చేయడం, జపించడం వల్ల కూడా కోపాన్ని నియంత్రించుకోవచ్చు.

తామసిక వస్తువులకు దూరంగా ఉండండి. మద్యం, సిగరెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, ఈ తామసిక వస్తువులన్నీకోపాన్ని చాలా రెట్లు పెంచుతాయి. కనుక వీటిని వినియోగించవద్దు. దీనితో పాటు మహిళలను గౌరవించాలి. వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవడం వలన జీవితంలో గ్రహాల స్థానాన్ని కూడా బలపడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.