Astro Tips: మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే సోమవారం ఇలా చేయండి..!

|

May 02, 2022 | 7:00 AM

Astro Tips: హిందూమత విశ్వాసాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా ..

Astro Tips: మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే సోమవారం ఇలా చేయండి..!
Lord Shiva
Follow us on

Astro Tips: హిందూమత విశ్వాసాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు. వీలైతే సోమవారం తెల్లవారుజామున స్నానం చేసిన తరువాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఇంట్లో శివుడి విగ్రహం, ఫోటోకు పూజ చేయండి. సోమవారం నాడు ఉపవాసం ఉండటంతో పాటు.. వస్త్రాలు, ఆహారం దానం చేయడం వల్ల కూడా పరమేశ్వరుడి కరుణ మీపై ఉంటుంది. ఇలా సోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్వాసం. శివుడి కృపతో మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయని వేదాంతులు చెబుతున్నారు.

సోమవారం ఉపవాసం మూడు రకాలు..

1. ప్రతి సోమవారం ఉపవాసం
2. సోమ ప్రదోష వ్రత పూజ
3. 16 రోజుల సోమవారం వ్రత పూజ

సోమవారం ఉపవాసంలో ఈ తప్పు చేయకండి..
రాగి పాత్రలో పాలు పోసి శివుడికి అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం స్వామి వారికి అయిష్టమట.
శివలింగంపై చందనం వేసి అభిషేకించండి. అయితే, దానిపై కుంకుమ, పసుపు వేయొద్దు.
సోమవారం వ్రతం పాటించే వారు తెల్లని వస్తువులను దానం చేయకూడదు.
సోమవారం పూజ చేసే వ్యక్తి కుంకుమ, పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు.
సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు.
సోమవారం ఉత్తరం, తూర్పు దిశలో ప్రయాణించ కూడదు.

(గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని హిందూ మత గ్రంధాలు, వేదపండితులు అందించిన సమాచారం మేరకు పబ్లి్ష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.)

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..