Astro Tips: జీవితంలో ఆనందం కలగాలంటే.. ఉంగరాన్ని ఏ వేలికి ధరించడం మంచిదంటే..

|

May 21, 2023 | 12:05 PM

సృష్టి లయకారుడు శివయ్య కన్నుల నుండి వెండి ఖనిజం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. కనుక వెండిని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెండి ఉన్న చోట కీర్తి వెల్లివిరుస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, తొమ్మిది గ్రహాల్లో శుక్రుడు, చంద్రుడితో సంబంధం ఉన్న లోహం వెండి. వెండి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

Astro Tips: జీవితంలో ఆనందం కలగాలంటే.. ఉంగరాన్ని ఏ వేలికి ధరించడం మంచిదంటే..
Benefits Of Wearing A Silver
Follow us on

స్త్రీలు, పురుషులు తమ చేతులకు లేదా మెడలో నగలు ధరించడానికి ఇష్టపడతారు. బంగారం, వెండి, ప్లాటినం వంటి వివిధ లోహ ఆభరణాలు ధరిస్తారు. ఈ లోహాల్లో బంగారం తర్వాత వెండి ఆభరణాలకు విశిష్టత స్థానం ఉంది. ముఖ్యంగా జాతకం ప్రకారం ధరించే వెండి ఉంగరాలు విశిష్ట స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం వెండి ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలో తెలుసుకుందాం.

సృష్టి లయకారుడు శివయ్య కన్నుల నుండి వెండి ఖనిజం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. కనుక వెండిని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెండి ఉన్న చోట కీర్తి వెల్లివిరుస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, తొమ్మిది గ్రహాల్లో శుక్రుడు, చంద్రుడితో సంబంధం ఉన్న లోహం వెండి. వెండి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

చిటికెన వేలుకు విధిగా ఉంగరాన్ని ధరించాలి

ఇవి కూడా చదవండి

ఏదైనా గురువారం రాత్రి నీటిలో వెండి ఉంగరాన్ని పెట్టి ఆ రోజు రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఆ ఉంగరాన్ని విష్ణువు పాదాల వద్ద ఉంచి పూజించండి. పూజ చేసిన తర్వాత ఉంగరానికి చందనం పూసి అక్షతలు వేసి దీపం వెలిగించి పూజించండి. అనంతరం ఉంగరాన్ని కుడి చేతి చిటికెన వేలుకు ధరించండి.

వెండి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెండి ఉంగరం ధరించడం ద్వారా శుక్రుడు, చంద్రుడు ప్రభావం మనిషిపై చూపుతాయి. ముఖంలోని అందం పెరుగుతుంది. మచ్చలు తొలగిపోతాయి. వెండి ఉంగరం ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు కోపం కూడా నియంత్రణలో ఉంటుంది.

రుమాటిజం, కఫం, కీళ్ళు లేదా ఎముకలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వెండి ఉంగరం  ప్రభావవంతంగా నివారిస్తుంది.

వెండి ఉంగరాలు ఇష్టపడని వారు మెడలో వెండి గొలుసును ధరించాలి. ఇలా చేయడం వలన శరీరంలోని వాత, కఫ, పిత్తాలను సమతుల్యం చేస్తుంది. కనుక ఏదో ఒక కారణంతో ఏదొక రూపంలో వెండిని ఉపయోగించండి. వెండిని ధరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..