
భార్యాభర్తలిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడానికి.. దంపతుల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, మాట తీరుపై దృష్టి పెట్టాలి. అయితే వివాహ బంధం జీవితాంతం నిలబడాలంటే దంపతుల మధ్య ఉన్న విభేదాలను కొన్ని జ్యోతిష్య పరిహారాల ద్వారా కూడా తొలగించుకోవచ్చు. భార్యాభర్తలు నిర్దిష్ట మంత్రాలను జపించడం, దేవాలయాలను సందర్శించడం, మతపరమైన వస్తువులను దానం చేయడం వంటి జ్యోతిషశాస్త్ర పరిష్కారాలు కూడా సహాయపడతాయి. వీటితో పాటు వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి, దంపతుల మధ్య ప్రేమను పదిలం చేయడానికి మరికొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏమిటంటే…
తన భార్యపై భర్త ఎప్పుడూ కోపంగా ఉంటే, భార్యను అవమానిస్తుంటే, భార్య మాట వినడం అవమానంగా భావిస్తే, భార్యని ప్రతి చిన్న విషయానికి ఎగతాళి చేస్తే, భార్యతో తప్పుగా ప్రవర్తిస్తే.. ఇలా నిత్యం భర్త చేతిలో ఇబ్బంది పడుతున్న స్త్రీ శనివారం తన కుడి చేతిలో 21 లవంగాలు తీసుకొని తన భర్త పేరును 21 సార్లు ఉచ్చరించి..ఆ లవంగాలను ఇంటి పూజ గదిలో ఉంచాలి. ఆదివారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ లవంగాలను కర్పూరం వేసి కాల్చండి. ఇలా ఎనిమిది శనివారాలు నిరంతరం చేయండి. ఈ పరిహారం చేయడం వలన భర్త.. తన భార్యకు సహకరించడం ప్రారంభిస్తాడు.
ఎనిమిది శనివారాల తర్వాత కూడా ఆ భార్యకు తగిన ఫలితం రాకపోతే.. ఈ ప్రయత్నాన్ని కనీసం మూడు సార్లు పునరావృతం చేయమని పండితులు సూచిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య మంచి సంబంధానికి రహస్యం ఏమిటంటే.. ప్రేమ చిహ్నాలను ఉపయోగించడం. అయితే అవి జంటగా ఉండాలి. మంచం దగ్గర సైడ్ టేబుల్ మీద జంట హంసలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోండి.
భార్యాభర్తలు “ఓం నమః శివాయ” లేదా “ఓం క్లిం కృష్ణాయ నమః” వంటి మంత్రాలను జపించాలి.
భార్యాభర్తలు ప్రతి గురువారం రామ-సీతా ఆలయానికి వెళ్లి ప్రసాదం సమర్పించాలి.
భార్యాభర్తలు ప్రతి గురువారం తులసి మొక్కకి పసుపు కలిపిన నీటిని పోయాలి.
రాధా-కృష్ణుల చిత్రపటాన్ని పడకగదిలో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య సానుకూల శక్తి పెరుగుతుంది.
భార్యాభర్తలు ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.