హిందూ మతంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడ్డాయి. అదే విధంగా శుక్రవారం లక్ష్మీదేవి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీ దేవిని భక్తితో, ఆచారాలతో పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలై తన భక్తులను అనుగ్రహిస్తుందని విశ్వాసం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు శుక్రవారం ఉపవాసం, పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి తన భక్తుల కోరికలన్నీ తీరుస్తుంది.
శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నియమ నిష్ఠల గురించి చాలా మందికి తెలుసు. అయితే హిందూమత విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. శుక్రవారం చేసే కొన్ని పనులు లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తాయని.. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వాసం. ఈ రోజు శుక్రవారం చేయకూడని ఐదు పనులు ఏంటో తెలుసుకుందాం..
ఇంటిని రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజాదికార్యక్రమాల సమయంలో మాత్రమే కాదు ఎల్లపుడూ ఇంటిలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి ముఖ్యంగా పరిశుభ్రతను ఇష్టపడుతుంది. అందుకే పొరపాటున కూడా ఇంటిని మురికిగా ఉంచవద్దు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఇంటిని శుభ్రం చేయవద్దు.
పూజల సమయంలో మాత్రమే కాదు ప్రత్యేక పర్వదినాల్లో మద్యపానం, మాంసాహారం నిషిద్ధమని భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం రోజున మద్యం, మాంసం తినకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంది. ఆ ఇంటి వైభవం కూడా క్రమంగా పోతుంది.
హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున చక్కెరను దానం చేయకూడదు లేదా అప్పుగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీనంగా మారుతుంది. సుఖ సంతోషాలు, కీర్తిలు శుక్ర గ్రహ కారకాలని విశ్వాసం. శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి , శ్రేయస్సు లోపిస్తుంది.
శుక్రవారం రోజున డబ్బుల లావాదేవీలు చేయరాదు. ఒకరి నుంచి డబ్బు తీసుకోకూడదని లేదా ఇవ్వకూడదని నమ్ముతారు. అదే విధంగా ఎవరి దగ్గరా అప్పు చేయకూడదు, ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో పేదరికంతో ఇబ్బంది పడతారని.. ఇంట్లో అశాంత నెలకొంటుందని విశ్వాసం.
శుక్రవారం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పండి. ఈ రోజున అన్ని రకాల తగాదాలకు దూరంగా ఉండండి. అదే విధంగా మాట విషయంలో నియంత్రణ కలిగి ఉంచుకోవాలి. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి లేదా దుర్భాషలాడకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు