Astro Tips for Kids: మీ పిల్లలు మొండితనం, కోపంతో ఉంటారా.. ఈ జ్యోతిష్య పరిహారాన్ని చేసి చూడండి

|

May 21, 2023 | 10:43 AM

పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే.. మొండితనం, అతి కోసం వంటి సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు. వీటిని పాటిస్తే.. పిల్లల నడవడికతో అనేక మార్పులు వస్తాయని పేర్కొన్నాయి. 

Astro Tips for Kids: మీ పిల్లలు మొండితనం, కోపంతో ఉంటారా.. ఈ జ్యోతిష్య పరిహారాన్ని చేసి చూడండి
Astro Tips For Kid
Follow us on

పిల్లలంటే అందరికీ ఇష్టమే. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అందమైన భవిష్యత్ ను ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లల కోరికలను నెరవేర్చాలని, సంతోషాన్ని, అందమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటారు. తమ పిల్లల ప్రతి కోరికను నెరవేర్చాలని కలలు కంటారు..ప్రేమను ఇస్తారు. అయితే పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే గారాబం వారిని పాడు చేస్తుంది. తాము చెప్పిన మాటలను అంగీకరించకపోతే,  చిరాకు పడటం, మొండిగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. పిల్లలకు కోపం ఎక్కువఅవుతుంది. ఈ కోపం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ గుణాలు.. పెరుగుతున్న పిల్లలతో పాటు, తల్లిదండ్రులను మాత్రమే కాకుండా కాలక్రమంలో వారి భాగస్వామిని కూడా ఇబ్బంది పెడతాయి. అయితే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే.. మొండితనం, అతి కోసం వంటి సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు. వీటిని పాటిస్తే.. పిల్లల నడవడికతో అనేక మార్పులు వస్తాయని పేర్కొన్నాయి.

జ్యోతిష్య పరిహారాలు

తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటలను వింటారని.. ఇతర వ్యక్తుల ముందు పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారని.. ఉండాలని కలలు కంటారు. అయితే ఒక్కోసారి తల్లితండ్రుల పెంపకం వల్ల.. లేదా పిల్లల అనారోగ్యం వల్ల మొండిగా, చిరాకుగా, విపరీత కోపాన్ని ప్రదర్శిస్తారు. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు చాలా కలత చెందుతారు. పిల్లలపై కోపంగా ఉంటారు. ఒకొక్కసారి దండిస్తారు కూడా. అయితే ఇలా చేయడం వల్ల పిల్లల స్వభావం రోజురోజుకు మరింత మొండిగా మారుతుంది. పరిస్థితులు అధ్వాన్నంగా మారతాయి. పిల్లల్లో ప్రవర్తన మార్చడానికి ఈ రోజు జ్యోతిష్య పరిష్కారాల గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

గోధుమ పిండి, పంచదార కలిపిన పదార్ధంతో పిల్లలకు దిష్టి తీసి.. ఈ మిశ్రమాన్ని రావి చెట్టు దగ్గర ఉన్న చీమలకు తినిపించండి. చీమలకు చక్కర వేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

ఈ పరిహారం ఎప్పుడు చేయాలి?

పిల్లల మొండితనం,  కోప స్వభావాన్ని వదిలించడానికి ఈ పరిహారం దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. శుక్రవారం ఉదయం 11 గంటల లోపు ఈ పరిహారం చేయాలి.

హిందూ సనాతన ధర్మం ప్రకారం.. చీమ ప్రతికూల వాతావరణంలో కూడా జీవించే కీటకం. శ్రమ జీవి. తెలివైన కీటకం. కనుక చీమకు ఎంత ఎక్కువ ఆహారం ఇస్తే.. అంతగా పిల్లలకు మేలు జరుగుతుందని .. శరీరంలోని ప్రతికూలత తొలగిపోతుందని.. పిల్లల స్వభావంలో మార్పులు కనిపిస్తాయని చెప్పారు. ఇలా 11 శుక్రవారాలు ఈ నివారణ పాటించిన అనంతరం.. పిల్లల స్వభావంలో మార్పు వస్తుంది. మొండితనం, కోపం తగ్గుతుంది. వినయం, విధేయతను కలిగి ఉంటారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..