Srisailam Devasthanam: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రంలో ఆర్జితసేవలను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో కె.ఎస్ రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ మల్లికార్జున స్వామికి సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఆశీర్వచన మండపంలో భ్రమరాంబా దేవికి కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే.. గణపతి, రుద్ర, మృత్యుంజయ, చండీ హోమాలు ప్రారంభించనున్నట్లు ఈవో తెలిపారు. సోమవారం సాయంత్రం స్వామి అమ్మ వార్ల నిత్య కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం నిర్వహిస్తామన్నారు. అలాగే.. ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్ టికెట్లను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవల నిర్వహించనున్నట్లు ఈవో రామారావు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. కరోనా కారణంగా శ్రీశైలం క్షేత్రంలో మూసివేసిన కళ్యాణ కట్ట.. తాజాగా తెరుచుకుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానంలోని కళ్యాణ కట్టను తిరిగి ఓపెన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆలయ క్షరకులు విడతల వారీగా విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు కరోనా కారణంగా శ్రీశైలం క్షేత్రంలో కళ్యాణ కట్ట మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షరకులు లేకపోవడంతో భక్తులు.. ఒకరి తల నీలాలను మరొకరు గీసుకున్నారు. ఈ దృశ్యాలు సంచలనంగా మారడంతో.. ఆలయ అధికారులు స్పందించారు. కళ్యాణ కట్ట తెరుస్తున్నట్లు ప్రకటించి.. ఓపెన్ చేశారు. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు.. కళ్యాణకట్టలో తల నీలాలు సమర్పించుకుంటున్నారు.
Also read:
Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్