Garuda Purana: మీరు ఈ పనులు చేస్తున్నారా? అయితే అనారోగ్యంతో మీ ఆయుష్షు తగ్గిపోతుంది..చేయకూడని ఆ ఐదు పనులు ఏమిటంటే..

Garuda Purana: మీరు ఈ పనులు చేస్తున్నారా? అయితే అనారోగ్యంతో మీ ఆయుష్షు తగ్గిపోతుంది..చేయకూడని ఆ ఐదు పనులు ఏమిటంటే..
Garuda Puranam

గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగనిస్తారు. విష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను వివరించాడని నమ్ముతారు.

KVD Varma

|

Aug 18, 2021 | 9:23 PM

Garuda Purana:  గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగనిస్తారు. విష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను వివరించాడని నమ్ముతారు. తన వాహనం గరుడ అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తూ, విష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడపురాణం అని పిలుస్తారు. దీనితో పాటు, మరణం తరువాత వ్యక్తుల కర్మల ఫలితాలు.. ఆత్మ దిక్కుతోచని స్థితి నుండి పునర్జన్మ పొందడం వరకు ఉన్న పరిస్థితులు గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు.  గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు అనేది. ఏ పనులను చేయడం ద్వారా మన తగ్గిపోతుందో.. అంటే ఆయుష్షు తగ్గిపోతోందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్న అటువంటి చేయకూడని పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ అలవాట్లను వదిలేయడం మనకు ప్రయోజనకరం.

1. పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంలో లెక్కించబడుతుంది. అయితే, పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణం. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది.

2. మీరు మాంసాహారులా? నిలువ ఉంచిన మాంసాన్ని తింటున్నారా? అయితే, మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్టే. ఎదనుకంటె పాత మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు దీనిని తింటే, ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరుకుని మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది.

3. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచే  వారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు.ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్షు పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితిలో, వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి.

4. శ్మశానవాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగలో గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల, దహన సంస్కారాల తర్వాత, అక్కడ ఎక్కువసేపు ఉండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి. తరువాత స్నానం చేయాలి.

5. గరుడ పురాణం ప్రకారం, ఉదయం సెక్స్ చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, రుషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి నిల్వ చేయబడుతుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)

Also Read: Karma Siddhanta: కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి..? జీవి చేసేపనులతో ఫలితం అనుభవిస్తాడా

చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే.. ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu