Maha Shivaratri: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు దర్శన టికెట్లు.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నదంటే..

|

Feb 08, 2023 | 10:07 AM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తుల కోసం.. 1,075 స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన టికెట్లను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుక్ చేసుకున్న వారికి రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు ఇవ్వనున్నారు.

Maha Shivaratri: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు దర్శన టికెట్లు.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నదంటే..
Srisalam Apsrtc
Follow us on

మహా శివరాత్రికి శివ క్షేత్రలు ముస్తాబవుతున్నాయి. మరోవైపు భక్తుల సౌకర్యార్ధం అధికారులు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల నెలకొననుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తుల కోసం.. 1,075 స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన టికెట్లను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుక్ చేసుకున్న వారికి రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు ఇవ్వనున్నారు.

ఈ నెల 9నుంచి ఆర్టీసీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా ప్రయాణానికి 15 రోజులు ముందుగానే దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. ఇప్పటికే బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉంచింది ఆర్టీసీ. ఇప్పుడు శ్రీశైలంలోనూ అదే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా.. భక్తులకు రాత్రి వేళల్లో వసతి కల్పించడంతో పాటు.. టూరిస్ట్‌ గైడ్‌లనూ అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..