April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
Telugu festivals April 2026: 2026 ఏప్రిల్ నెల తెలుగు క్యాలెండర్ ప్రకారం పండుగలు, శుభతిథులు,ముఖ్యమైన రోజులను వివరంగా తెలుసుకోండి. చైత్ర, వైశాఖ మాసాలు కలిసి ఉన్న ఈ నెలలో శ్రీ సత్యనారాయణ పూజ, హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, అక్షయ తృతీయ, అంబేద్కర్ జయంతి, ఎర్త్ డే, అంతర్జాతీయ నృత్య దినోత్సవం వంటి అనేక ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి.

April Festivals
2026వ సంవత్సరం ఏప్రిల్ నెల తెలుగు క్యాలెండర్ ప్రకారం వచ్చే పండుగలు, శుభతిథులు, ముఖ్యమైన దినోత్సవాలను ఈ వివరణాత్మక కథనంలో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెల స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చైత్ర శుద్ధ చతుర్దశి (ఏప్రిల్ 1) నుంచి వైశాఖ శుద్ధ చతుర్దశి (ఏప్రిల్ 30) వరకు విస్తరించి ఉంది. ఈ నెలలో చైత్ర మాసం (ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 17 వరకు), వైశాఖ మాసం (ఏప్రిల్ 18 నుంచి) కలిసి ఉన్నాయి.
- ఏప్రిల్ 1, బుధవారం: చైత్ర శుద్ధ చతుర్దశి, ఉత్తరా నక్షత్రం. శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం ఆచరిస్తారు.
- ఏప్రిల్ 2, గురువారం: పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం. ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకునే హనుమాన్ జయంతి (హనుమత్ విజయోత్సవం) ఈ రోజే. హనుమాన్ దీక్ష తీసుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభిస్తారు. కోయిలకొండ శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం కూడా ఈ రోజే ఉంది.
- ఏప్రిల్ 3, శుక్రవారం: చైత్ర బహుళ పాడ్యమి తిథి, చిత్త నక్షత్రం. మంథని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం జరుగుతుంది. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే, ఇది ప్రభుత్వ సెలవు దినం.
- ఏప్రిల్ 5, ఆదివారం: తదియ తిథి, విశాఖ నక్షత్రం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి. సంకటహర చతుర్థిని కూడా ఆచరిస్తారు. ఈస్టర్ సండే కూడా ఈ రోజే వస్తుంది.
- ఏప్రిల్ 7, మంగళవారం: పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ హెల్త్ డే) జరుపుకుంటారు.
- ఏప్రిల్ 11, శనివారం: నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. జ్యోతిరావు ఫూలే జయంతి ఈరోజు.
- ఏప్రిల్ 13, సోమవారం: ఏకాదశి తిథి, ధనిష్ఠ నక్షత్రం. వరూధిని ఏకాదశి ఆచరిస్తారు.
- ఏప్రిల్ 14, మంగళవారం: ద్వాదశి తిథి, శతభిషా నక్షత్రం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి. మేష సంక్రమణం, అశ్విని కార్తె ప్రారంభం. పంజాబ్‌లోని సిక్కుల నూతన సంవత్సరం బైసాఖి కూడా ఈ రోజే.
- ఏప్రిల్ 15, బుధవారం: త్రయోదశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. బెంగాలీ నూతన సంవత్సరం బోహగ్ బిహు. హిమాచల్ డే కూడా ఈ రోజే ఉంది.
- ఏప్రిల్ 16, గురువారం: చతుర్దశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. మాస శివరాత్రి.
- ఏప్రిల్ 17, శుక్రవారం: అమావాస్య తిథి, రేవతి నక్షత్రం. చైత్ర మాసం ముగింపు. ప్రపంచ హోమోఫిలియా దినోత్సవం.
- ఏప్రిల్ 18, శనివారం: వైశాఖ శుద్ధ పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రం. వైశాఖ మాసం ప్రారంభం. చంద్రోదయం. ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే).
- ఏప్రిల్ 19, ఆదివారం: విదియ తిథి, భరణి నక్షత్రం. మహర్షి పరశురామ జయంతి. ప్రపంచ కాలేయ దినోత్సవం.
- ఏప్రిల్ 20, సోమవారం: తదియ తిథి, కృత్తికా నక్షత్రం. అక్షయ తృతీయ జరుపుకుంటారు. బసవ జయంతి కూడా ఈ రోజే.
- ఏప్రిల్ 21, మంగళవారం: చవితి తిథి, రోహిణి నక్షత్రం. శ్రీ ఆదిశంకరాచార్య జయంతి.
- ఏప్రిల్ 22, బుధవారం: పంచమి/షష్ఠి తిథి, ఆర్ద్ర నక్షత్రం. శ్రీ రామానుజ జయంతి. ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే).
- ఏప్రిల్ 23, గురువారం: సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం. ప్రపంచ పుస్తక దినోత్సవం, ఆంగ్ల భాషా దినోత్సవం.
- ఏప్రిల్ 24, శుక్రవారం: అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం.
- ఏప్రిల్ 25, శనివారం: నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ప్రపంచ మలేరియా దినోత్సవం.
- ఏప్రిల్ 26, ఆదివారం: దశమి తిథి, మఖా నక్షత్రం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన.
- ఏప్రిల్ 27, సోమవారం: ఏకాదశి తిథి, పుబ్బా నక్షత్రం. సర్వేషాం ఏకాదశి, మోహినీ ఏకాదశి. జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. భరణి కార్తె ప్రారంభం.
- ఏప్రిల్ 28, మంగళవారం: ద్వాదశి తిథి, ఉత్తరా నక్షత్రం. శ్రీ పరశురామ ద్వాదశి.
- ఏప్రిల్ 29, బుధవారం: త్రయోదశి తిథి, హస్త నక్షత్రం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం (ఇంటర్నేషనల్ డాన్స్ డే), పరిపాలన నిపుణుల దినోత్సవం.
- ఏప్రిల్ 30, గురువారం: చతుర్దశి తిథి, చిత్త నక్షత్రం. నృసింహ జయంతి.
Follow Us
