
ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి ఉపవాసం ప్రతి నెలా రెండుసార్లు, అంటే సంవత్సరంలో మొత్తం 24 సార్లు పాటిస్తారు. అదే సమయంలో వైశాఖ మాసంలోని కృష్ణ పక్షంలో అపర ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు పొందడానికి ఏకాదశి తిథి ఉత్తమ రోజుగా పరిగణించబడుతుందని చెబుతారు. ఈ రోజున సరైన ఆచారాలతో లక్ష్మీ నారాయణుడిని పూజించే వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున తులసి మొక్కకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు చేయడం ద్వారా.. లక్ష్మీ నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఇంటిలో నివసిస్తుందని నమ్మకం.
అపర ఏకాదశి ఎప్పుడు?
వైదిక క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి మే 23న ఉదయం 1:12:12 గంటలకు ప్రారంభమవుతుంది. తేదీ మే 23న రాత్రి 10:29 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం అపర ఏకాదశి ఉపవాసం మే 23న పాటించబడుతుంది.
ప్రసాదంలో తులసిని చేర్చండి
అపర ఏకాదశి రోజున పూజ సమయంలో శ్రీ మహా విష్ణువు , లక్ష్మీ దేవికి పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. నైవేద్యంలో తులసి దళాలను చేర్చాలి. తులసి దళాలు లేని నైవేద్యాన్ని భగవంతుడు అంగీకరించడని నమ్ముతారు.
నెయ్యి దీపం వెలిగించండి
అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీర్వదం ఆ కుటుంబ సభ్యులపై ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు అపర ఏకాదశి రోజున, విష్ణువును ధ్యానించి, తులసి మొక్కకు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారంకి నమ్మకం.
ఈ మంత్రాలను జపించండి
మహాప్రసాద్ జననీ సౌభాగ్యవర్దినీ ఆది వ్యధి హరా నిత్యం తులసీ త్వాం నమోస్తుతే
తులసి పూజ మంత్రం
లభతే సుతారం భక్తిమంతే విష్ణుపదం లభేత్ । తులసీ భూర్మలక్ష్మి : పద్మిని శ్రీహరప్రియా
ఓం తులసీ నమః
ఓం నారాయణాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవయే
ఓం శ్రీ తులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్: (తులసి గాయత్రి మంత్రం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు