TTD: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ

|

Jul 21, 2021 | 5:14 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అర్చకుల శాశ్వత నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TTDలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకం...

TTD: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అర్చకుల శాశ్వత నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TTDలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకం, అర్చకత్వం నుంచి విరమణ నుంచి మినహాయింపు అంశాలపై ఏక సభ్య కమిటీ నియామకం చేసింది. TTD అర్చకులు, భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం చేయడం, క్రమబద్దీకరణకు 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కోరినట్లుగా ఇదే అంశంపై అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతోంది కమిటీ.

కమిటీ ఛైర్మన్‌గా జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఛైర్మన్‌ జస్టిస్‌ శివశంకర్‌రావును నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే టీటీడీ ఛైర్మన్ గా మరోసారి వైవి సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:  Viral News: ఆకాశం నుంచి ఆశ్చర్యకర రీతిలో వచ్చిన మృత్యు పాశం… ఓ వ్యక్తిని బలితీసుకున్న నెమలి..

American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..