AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vontimitta: రేపు పున్నమి వెన్నెలల్లో సీతమ్మని పెళ్లాడనున్న రామయ్య.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Vontimitta: దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం (Sita Ramula Kalyanam) చైత్ర మాసం నవమిరోజున పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పౌర్ణమి (Chaitra Maas Purnima)..

Vontimitta: రేపు పున్నమి వెన్నెలల్లో సీతమ్మని పెళ్లాడనున్న రామయ్య.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Vontimitta Kodandarama Swam
Surya Kala
|

Updated on: Apr 14, 2022 | 5:58 PM

Share

Vontimitta: దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం (Sita Ramula Kalyanam) చైత్ర మాసం నవమిరోజున పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పౌర్ణమి (Chaitra Maas Purnima) రోజు రాత్రి జరుగుతుంది. ఈ నేపథ్యంలో కడప ఒంటిమిట్టలో రేపు జరగనున్న శ్రీకోదండ రాముని కల్యాణానికి పూర్తయ్యాయి.    రేపు సాయంత్రం కల్యాణానికి సీఎం జగన్ కానున్నారు.  శ్రీకోదండ రాముని కల్యాణానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, టిటిడి అధికారులు ఏర్పాట్లు  పూర్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో కార్యక్రమం  ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున చెప్పారు. కరోనా నేపథ్యంలో స్వామివారి కళ్యాణం గత రెండేళ్ళగా ఏకాంతంగా జరిగింది. అయితే ఈ ఈఏడాది పున్నమి వెన్నెలలో జరగనున్న స్వామివారి కల్యాణ కార్యక్రమానికి భక్తులను అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కోదండరామయ్య కల్యాణోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్ రేపు సాయంత్రం ఆరుగంటలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. దేవాలయంలో రాముల వారి దర్శనానంతరం కల్యాణ ప్రాంగణానికి చేరుకుంటారు.

నవ్యంధ్రప్రదేశ్‌ లో  సీతారాముల కల్యాణాన్ని అధికారికంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కోదండ రాముడి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రెండేళ్ళ తరువాత ఒంటిమిట్ట రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.  పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమమర్పిస్తుంది. రాత్రి వేళలో సీతారాముల కల్యాణోత్సవం చేస్తున్నందున ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.  భక్తుల రక్షణ కోసం  ఏర్పాట్లు చేశారు.

Also Read:Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీలో గత 24గంటల్లో 50 శాతం పెరుగుదల.. స్కూల్‌లో టీచర్, స్టూడెంట్‌కు పాజిటివ్

Rani Karnavati: చరిత్ర చెప్పని పాఠం ఈ యోధురాలు.. ముక్కులు కత్తిరించే రాణిగా ఖ్యాతి..