Tirumala: వేల కిలోమీటర్లు నడిపిస్తున్న భక్తిభావం.. ద్వారకా నుంచి తిరుమలకు పయనమైన వృద్ధ జంట

|

Aug 28, 2022 | 6:29 PM

విస్తరిస్తున్న టెక్నాలజీ, అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలతో కాలినడకను పూర్తిగా మానేశాం. షాపుకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా, మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తేవాలన్నా బండేసుకుని వెళ్లిపోతున్నాం. కనీసం...

Tirumala: వేల కిలోమీటర్లు నడిపిస్తున్న భక్తిభావం.. ద్వారకా నుంచి తిరుమలకు పయనమైన వృద్ధ జంట
Tirumala Padayatra
Follow us on

విస్తరిస్తున్న టెక్నాలజీ, అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలతో కాలినడకను పూర్తిగా మానేశాం. షాపుకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా, మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తేవాలన్నా బండేసుకుని వెళ్లిపోతున్నాం. కనీసం పక్క గల్లీలోకి వెళ్లేందుకూ బైక్ నే ఉపయోగిస్తున్నాం. దీంతో కనీసం పట్టుపని పది నిమిషాలు కూడా నడవలేకపోతున్నాం. ఫలితంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కానీ గుజరాత్ కు చెందిన ఓ వృద్ధ జంట మాత్రం నాలుగున్నర నెలలుగా నడుస్తూనే ఉంది. తిరుమల (Tirumala) శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు స్వగ్రామం నుంచి కాలినడకన పయనమయ్యారు. వేల కిలోమీటర్లు నడుస్తూ తెలంగాణకు చేరుకున్నారు. తాము అనారోగ్యానికి గురైన సమయంలో తిరుమల స్వామికి మొక్కుకున్నామని, ఆ మొక్కు చెల్లించుకునేందుకు ద్వారకా నుంచి తిరుమలకు కాలినడకన యాత్ర చేపట్టామని వారు వెల్లడించారు. గుజరాత్ (Gujarath) లోని ద్వారకకు చెందిన హర్దేవ్‌ ఉపాధ్యాయ, సరోజ దంపతులు తిరుమల వస్తామని మొక్కుకున్నారు. హర్దేవ్‌కు గుండె సంబంధిత సమస్యలు రావడంతో డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. ఆ సమయంలో ఆయన తన ఆరోగ్యం బాగుపడితే, మళ్లీ మునుపటిలా మారితే సతీసమేతంగా తిరుమలకు కాలినడకన వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది.

దీంతో మొక్కు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దుస్తులు, మందులు, వంటసామగ్రి వంటి వస్తువులను ట్రాలీ బండిలో వేసుకొని తోసుకుంటూ ద్వారక నుంచి తిరుమలకు నాలుగు నెలల క్రితం పయనమయ్యారు. మార్గమధ్యంలో వారు సంగారెడ్డి చేరుకున్నారు. తాము ఇంటి నుంచి బయలుదేరి నాలుగున్నర నెలలు అవుతోందని, రోజుకు 20-30 కి.మీ నడుస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. రాత్రి వేళల్లో ఆలయాల్లో నిద్రిస్తున్నామని, మరుసటి రోజు నిద్ర లేచి కాలినడకన వెళ్తున్నామని వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాక రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లామని, అనంతరం ఇంటికి వెళ్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి