అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆహారం, వసతి, భద్రత ఏర్పాట్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి

|

Jun 04, 2024 | 7:19 AM

ఈ ఏడాది.. చార్ ధామ్ యాత్రలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఇప్పటికే అప్రమత్తమైంది. రెట్టింపు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బోర్డు సన్నాహాలు చేస్తోంది. జూన్ 29 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు రిజిస్ట్రేషన్ ను ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆహారం, వసతి, భద్రత ఏర్పాట్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Amarnath Yatra 2024
Follow us on

అమర్‌నాథ్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త చెప్పింది పాలనా యంత్రాంగం. ఈ నెల (జూన్) 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈసారి అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19 వరకు అంటే 52 రోజుల పాటు కొనసాగనుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యాల కల్పనలో పరిపాలన యత్రాంగం నిమగ్నమై ఉంది. ఈ ఏడాది.. చార్ ధామ్ యాత్రలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఇప్పటికే అప్రమత్తమైంది. రెట్టింపు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బోర్డు సన్నాహాలు చేస్తోంది. జూన్ 29 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు రిజిస్ట్రేషన్ ను ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది.

అమర్‌నాథ్ యాత్రకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అమర్‌నాథ్ యాత్రికుల కోసం మూడు ప్రదేశాల్లో బస ఏర్పాటు చేశారు. బహల్తాల్, పహల్తాల్, జమ్మూ ఈ మూడు చోట్ల ప్రతిరోజూ 50వేలు, 50వేలు మంది బస చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జమ్మూ నుంచి 20 వేల మందిని యాత్రకు పంపనున్నారు. 20 వేల మందిలో 10వేలు, 10 వేలుగా విభజించి రెండు మార్గాలలో పంపించానున్నారు. అంటే 10 వేల మందిని బల్తాల్ మార్గంలో పంపుతారు.మిగిలిన వారిని పహల్గామ్ మార్గంలో పంపుతారు.

వివిధ ప్రాంతాల్లో భక్తులకు భోజన ఏర్పాట్లు
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు మార్గ మధ్యలో 125 లంగర్లను ఏర్పాటు చేయనున్నారు. లంగర్ల వద్ద ప్రతిరోజూ సుమారు 1.5 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. లంగర్ జూన్ 17 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. లంగర్‌తో పాటు రూట్లలో 57 చోట్ల టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. 1.5 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రికులు బస చేసేందుకు అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైద్య సదుపాయం, భద్రతా ఏర్పాట్లు
ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో వైద్య సదుపాయల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పెద్దపీట వేసింది. చాలా చోట్ల శాశ్వత ఆసుపత్రులు నిర్మించారు. ఈ ఆసుపత్రుల్లో 1415 మంది ఆరోగ్య కార్యకర్తలు, 55 మెడికల్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ప్రయాణికుల భద్రతకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 500 కంపెనీల సీఏపీఎఫ్‌తో పాటు 1.20 లక్షల మంది సైనికులను భద్రత కోసం వినియోగించనున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..