Telugu News Spiritual Know Akshaya Tritiya significance, history according to Puranas and of buying gold on this auspicious day
Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేయడానికే కాదు.. ఈ రోజు విశేషం ఏమిటో తెలుసా..
వాస్తవానికి అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల పూజతో పాటు కొన్ని చర్యలు చేయవచ్చు. నిరుపేదలకు, బ్రాహ్మణాలకు స్వయం పాకం ఇవ్వండి. అంతేకాదు అసలు అక్షయ తృతీయకు పురాణాల ప్రకారం విశేషం ఏమిటో తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయంలో అనేక పండగలు, పర్వదినాలు. సీజనల్ కి అనుగుణంగా పండగలను జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఈ సంవత్సరం ఈ తేదీ శనివారం, 22 ఏప్రిల్ 2023న వస్తుంది. ఈ ప్రత్యేక మైన రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. ఈ రోజున నియమ నిబంధనల ప్రకారం పూజించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అయితే ప్రస్తుతం అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనే విశ్వసిస్తారు. వాస్తవానికి అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల పూజతో పాటు కొన్ని చర్యలు చేయవచ్చు. నిరుపేదలకు, బ్రాహ్మణాలకు స్వయం పాకం ఇవ్వండి. అంతేకాదు అసలు అక్షయ తృతీయకు పురాణాల ప్రకారం విశేషం ఏమిటో తెలుసుకుందాం..
అక్షయ తృతీయ పరశురాముడు జన్మించిన రోజు.
భగీరథుడు తపస్సుతో పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం అక్షయ తృతీయ
శ్రీరాముడు జన్మించిన యుగం.. త్రేతాయుగం మొదలైన పర్వదినం అక్షయ తృతీయ
అక్షయ తృతీయ శ్రీ కృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం