Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఏది కొనాలి? ఏది శ్రేయస్సును పెంచుతుందో తెలుసుకోండి

|

May 02, 2024 | 7:11 AM

అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రతి సెకను శుభ ముహూర్తమే. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా పంచాంగం అవసరం లేదు. విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున బంగారు ఆభరణాలను విరివిగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఏది కొనాలి? ఏది శ్రేయస్సును పెంచుతుందో తెలుసుకోండి
Akshaya Tritiya 2024
Follow us on

ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. క్షయం కలగకుండా ఉండుగాక, ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతులు, సంతోషం, సంపద, ఆస్తి, శ్రేయస్సుతో నిండి ఉండాలని .. ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని.. సిరి సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు.

రోజంతా  శుభ సమయం

అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రతి సెకను శుభ ముహూర్తమే. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా  పంచాంగం అవసరం లేదు.

అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలా?

విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున బంగారు ఆభరణాలను విరివిగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఈ రోజున ఏ లోహం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.. ఇంటికి సంపదలు చేకూరుతాయి? బంగారం, వెండి లోహాలు రెండూ వాటి సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి రెండింటినీ కొనుగోలు చేయవచ్చని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు. అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు. ఈ కారణంగా  అక్షయ తృతీయ, ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు, ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీ వద్దనే ఉంటుంది.. దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధించి ఉంది.

వెండి ఆనందం శ్రేయస్సును పెంచుతుంది

వెండి శుక్ర గ్రహానికి, చంద్రునికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు భౌతిక ఆనందం, సౌకర్యాలు, ప్రేమ, పిల్లలు మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది. అందువల్ల, వెండి లేదా వెండి వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించినప్పుడు అది వ్యక్తి శుక్ర, చంద్ర గ్రహాలను బలపరుస్తుంది. చంద్రుని బలం కారణంగా వ్యక్తి మానసికంగా చాలా బలంగా ఉంటాడు. శుక్రుడు జీవితంలో అన్ని రకాల సుఖాలు, ప్రేమ, అందం మొదలైనవాటిని ఇస్తాడు. అందుచేత వెండిని కొని ధరించడం శరీరానికి, మనసుకు, ఐశ్వర్యానికి మంచిదని చెప్పవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు