AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసి బయట పడేయండి..

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ఎలాగైతే వాస్తు దోషాల నివారణ జరుగుతుందో, అలాగే కొన్ని వస్తువులు ఉంటే కష్టాలు ఎదుర్కోక తప్పదని వాస్తు పండితులు చెబుతున్నార. కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల్లో సఖ్యత తగ్గడం, నిత్యం ఏదో ఒక గొడవ, మానసిక ఆనందం దూరమవడం వంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసి బయట పడేయండి..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Oct 06, 2023 | 11:55 AM

Share

ఇంట్లో ఉండే వారు మానసిక, శారీరక ఆరోగ్యంపై వాస్తు ప్రభావం చూపుతుందని నమ్మేవారు మనలో చాలా మంది ఉంటార. వాస్తు శాస్త్రంలో ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ఎలాగైతే వాస్తు దోషాల నివారణ జరుగుతుందో, అలాగే కొన్ని వస్తువులు ఉంటే కష్టాలు ఎదుర్కోక తప్పదని వాస్తు పండితులు చెబుతున్నార. కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల్లో సఖ్యత తగ్గడం, నిత్యం ఏదో ఒక గొడవ, మానసిక ఆనందం దూరమవడం వంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం…

* మనలో చాలా మంది ఇంట్లో విరిగిన దేవుని విగ్రహాలను అలాగే ఉంచుతాం. పూజా గది వరకు అయితే తొలగిస్తుండొచ్చు కానీ. హాల్‌లో గోడకు వేసే దేవుడి సీనరీలకు గురించి పెద్దగా పట్టించుకోరు. అవి ఎలాగైనా పట్టించుకోము. అయితే దేవతా రూపాలున్నా ఓ విగ్రహం కానీ, ఫొటోలు చిరిగినా.. విరిగినా వెంటనే తొలగించాలని చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చెబుతున్నారు.

* పాత న్యూస్‌ పేపర్లు ఇంట్లో ఉండడం సర్వ సాధారణమైన విషయం. అయితే లెక్కకు మించి పేపర్‌ కుప్పను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పటి పత్రికలను అప్పుడు అమ్మేయాలని చెబుతున్నారు. దుమ్ముధూళితో పేరుకుపోయిన న్యూస్ పేపర్స్ ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతున్నారు.

* చూడ్డానికి వెరైటీగా ఉంటుందని కొందరు ఇంట్లో బ్రహమ్మజెముడు లాంటి ముళ్ల మొక్కను పెంచుకుంటుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని, ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి లోపల ఇలాంటి మొక్కలు పెంచితే.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

* ఇక వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో విరిగిన తాళాన్ని ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా పనిచేయని, విరిపోయిన తాళం ఇంట్లో ఉంటే.. జీవితంలో సమస్యలు, అడ్డంకులు ఏర్పడుతాయని, కెరీర్‌కు ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు.

* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయని గడియారం ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన వాచ్ నిశ్చలతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతీ గడియారం కచ్చితంగా నడిచేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు వాస్తు శాస్త్రాలు, కొందరు వాస్తు నిపుణులు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి టీవీ9 ఎలాంటి బాధ్యత తీసుకోదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి…