Vastu Tips: భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడుతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు పెరుగుతాయి. ఇవి ఎప్పుడో ఒకసారి జరిగితే పర్వాలేదు. కానీ తరచుగా జరిగితే మాత్రం అది వాస్త దోషమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి ఇట్లు కట్టడం కాదు అది వాస్తుప్రకారం నిర్మించారా లేదా అనేది ముఖ్యం. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. లేదంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది. వాస్తుప్రకారం బెడ్‌రూమ్, కిచెన్, హాల్‌లో ఎలాంటి వస్తువులు ఉండాలో ఎలాంటి వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం. భార్యాభర్తల పడకగదిలో అలంకరణ వస్తువులను జతగా ఉంచుకోవాలి. బెడ్‌రూమ్‌లో టీవీ, కంప్యూటర్ ఉండకూడదు. ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి. మీ బెడ్‌ని పడకగదిలో దక్షిణం లేదా నైరుతిలో ఉంచండి. మంచం ఒకటే ఉండాలి. రెండు వేర్వేరు భాగాలు కలిపిన మంచం మంచిది కాదు. వాస్తు ప్రకారం భార్య ఎప్పుడూ భర్తకు ఎడమవైపునకి పడుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ పడకగదిలో దేవతల చిత్రాలను ఉంచవద్దు అలాగే చనిపోయిన వ్యక్తుల చిత్రాలను కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.
మీకు వివాహం అయితే ఆగ్నేయ దిశలో ఉన్న గదిలో ఎప్పుడూ ఉండకూడదు. ఇది మీ సంబంధానికి హానికరం. పడకగదిలో లేత రంగులను ఉపయోగించండి. అనవసరమైన వస్తువులతో గదిని నింపవద్దు. ఇలా చేస్తే గదిలో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటి పెద్దవారి గది నైరుతి దిశలో ఉండాలి. ఎందుకంటే బాధ్యతలు అన్ని వారే చూసుకుంటారు. కాబట్టి వారు నైరుతి దిశన ఉండాలి. మీరు పడుకునే మంచం చెక్కతో తయారుచేసి ఉండాలి. అది చతురస్రంగా ఉండాలి. నిద్రించేటప్పుడు, మీ తల దక్షిణం వైపు , పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. తప్పుగా పడుకోవడం మంచిది కాదు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వాస్తు, మత విశ్వాసాల ప్రకారం ఉంటుంది. సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగిందని గమనించండి.