Vastu Tips: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం మీ నట్టింట్లో నాట్యం చేసినట్లే..

| Edited By: Janardhan Veluru

Mar 03, 2023 | 12:02 PM

హిాందూ ధర్మ శాస్త్రాల ప్రకారం రావి చెట్టును కూడా పూజించడం ద్వారా శుభం కలుగుతుంది. కానీ అదే చెట్టును తెచ్చి ఇంట్లో నాటకూడదు అని పెద్దలు చెబుతారు.

Vastu Tips: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం మీ నట్టింట్లో నాట్యం చేసినట్లే..
Peepal Tree
Follow us on

హిాందూ ధర్మ శాస్త్రాల ప్రకారం రావి చెట్టును కూడా పూజించడం ద్వారా శుభం కలుగుతుంది. కానీ అదే చెట్టును తెచ్చి ఇంట్లో నాటకూడదు అని పెద్దలు చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం రావి చెట్టును ఇంట్లో నాటుకోవడం దరిద్రానికి వెల్కమ్ చెప్పడమే అవుతుంది. రావి చెట్టును ఇంటి ప్రాంగణంలో పాతితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. ఈ చెట్టులో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు.. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంట్లో పెంచడానికి వీల్లేదు. రావి చెట్టు గురించి అనేక నమ్మకాలు ప్రజలలో ఇంకా ఉన్నాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండటం సరికాదని చెబుతారు. అందుకే ఇంట్లో రావి చెట్టు పెంచకూడదు. ఒక వేళ అది పెరిగితే దాన్ని పెకిలించి వేయాలని కూడా చెబుతుంటారు. ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల, ఇంట్లో రోజురోజుకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.

పురాణాల ప్రకారం దేవతలందరూ రావి చెట్టులోనే ఉంటారు. రావి చెట్టు మూలంలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు, ముందు భాగంలో బ్రహ్మ ఉంటారని నమ్ముతారు. సనాతన ధర్మంలో, రావి చెట్టుని దేవతల దేవుడు అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

రావి చెట్టుకు సంబంధించిన ప్రత్యేక విషయాలు:

వాస్తు ప్రకారం, రావి చెట్టును ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు, ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైనది కాదు. ఒక వేళ ఇంటి ఆవరణలో ఈ మొక్క సహజంగా పెరుగుతున్నా సరే జాగ్రత్తగా తీసేయాలని పండితులు చెబుతున్నారు.

– ఇంటి బయట రావి మొక్క పెరిగితే దాన్ని అక్కడ నుంచి తీసి అడవిలో నాటాలి. ఈ మొక్కను తొలగిస్తున్నప్పుడు, పొరపాటున దాని మూలాలను కత్తిరించవద్దని గుర్తుంచుకోండి. పురాణ గ్రంథాలలో, రావి చెట్టు బ్రహ్మ నివాసంగా నమ్ముతారు. పొరపాటున కూడా ఇంటికి తూర్పు దిశలో రావి చెట్టును నాటవద్దు, ఇది ఇంట్లో డబ్బు కొరతకు దారితీస్తుంది.

– వాస్తు ప్రకారం, రావి చెట్టును నరికివేయడం జీవితంలో అశుభాన్ని తెస్తుంది. దీనివల్ల వైవాహిక జీవితంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఇది పిల్లలకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, గ్రంధాల ప్రకారం, రావి చెట్టును నరికివేయడం పుణ్యలోకాల్లోని పెద్దలకు బాధను కలిగిస్తుంది.

– వాస్తు శాస్త్రం ప్రకారం, రావి చెట్టు నీడ ఇంట్లోకి వస్తే, అది ఇంటి పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అనేక రకాల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

– రావి చెట్టు ఏ ఇంట్లో ఉంటే అక్కడి ప్రజల జీవితాల్లో సంక్షోభం, గొడవలు జరుగుతాయి. అంతేకాదు రావి చెట్టు ఇంటి నిర్మాణాన్ని కూడా బలహీనం చేస్తుంది.

– రావి చెట్టు కూడా కుటుంబం , ఎదుగుదలకు మంచిది కాదు. వాస్తు ప్రకారం దీని వల్ల పిల్లలకు సమస్యలు వస్తాయి. అదే సమయంలో, కుటుంబ అభివృద్ధిలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)