GarudaPurana : గరుడ పురాణం18 పురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనికి మహాపురాణం అనే పేరు కూడా ఉంది. గరుడ పురాణం ప్రధాన దేవత విష్ణువు. గరుడ పురాణం మరణం, మరణానంతర పరిస్థితుల గురించి తెలుపుతుంది. అంతేకాకుండా నీతి, నైతికత, జ్ఞానం, త్యాగం, తపస్సు మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. గరుడ పురాణంలో మోక్షం సాధించడానికి కొన్ని పద్దతులను తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.
1. విష్ణువును ఆశ్రయించండి..
పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని అన్ని లోకాలకు రక్షకుడిగా పరిగణిస్తారు. అతడికి లోకుల బాధలన్నింటిని తీసివేయగల శక్తి ఉంది. శ్రీహరి పేరుతో రోజును ప్రారంభించి ఎల్లప్పుడూ భగవంతుని భక్తిలో మునిగిపోయే వ్యక్తికి ఎటువంటి బాధలు ఉండవు. అతడి సమస్యలను విష్ణువు స్వయంగా పరిష్కరిస్తాడని నమ్ముతారు. మీరు దుఖం నుంచి విముక్తి కావాలంటే ప్రతిరోజు విష్ణు నామస్మరణ చేయాలి.
2. తులసిని ఆరాధించండి
తులసి మొక్క ప్రాముఖ్యత గరుడ పురాణంలో ప్రస్తావించారు. దీనిని దేవతల మొక్కగా పరిగణిస్తారు. మరణానికి ముందు ఒక వ్యక్తికి తులసి తీర్థం పోస్తారు. అంటే ఆ వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడని నమ్మకం. తులసి మొక్కను మీ ఇంట్లో తప్పక పెంచాలి ప్రతిరోజూ పూజించాలి.
3. ఏకాదశి ఉపవాసం
ఏకాదశి ఉపవాసం గ్రంథాలలో ఉత్తమ ఉపవాసాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఉపవాసం గురించి గరుడ పురాణంలో వివరించారు. ఈ రోజు ఉపవాసం చేసి విష్ణువుకు అంకితం చేస్తారు. ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం ద్వారా అన్ని పాపాలు అంతరిస్తాయని ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అందువల్ల వీలైతే ఏకాదశి రోజున కచ్చితంగా విష్ణు నామ స్మరణ చేయాలి.
4. మోక్షదాయణి గంగ
గరుడ పురాణంలో గంగా నదిని మోక్షదాయనిగా వర్ణించారు. కలియుగంలో దీని నీరు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గంగాజల్‌ను మతపరమైన పనులలో ప్రత్యేకంగా ఉపయోగించటానికి కారణం ఇదే . ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవాలి అప్పుడప్పుడు గంగానదిలో స్నానం చేయాలి.