Spirituality: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా.? సమస్యలు తప్పవు సుమా..

పండితులు చెప్పే విషయాలను తూచా తప్పకుండా పాటించే వారు మనలో చాలా మంది ఉన్నారు. వీటిలో ఎంత వరకు శాస్త్రీయ ఆధారాలు లేవని వారున్నా, నమ్మేవారి సంఖ్యే ఎక్కువ ఉంటుంది. మన పురాతన గ్రంధాల్లో కూడా మనుషులు ఎలా జీవించాలి.? ఎలాంటి ఇంట్లో ఉండాలి.? లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలన్న విషయాలను స్పష్టంగా వివరించారు...

Spirituality: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా.? సమస్యలు తప్పవు సుమా..
Spirituality
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2023 | 4:48 PM

భారతీయుల్లో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండితులు చెప్పే విషయాలను తూచా తప్పకుండా పాటించే వారు మనలో చాలా మంది ఉన్నారు. వీటిలో ఎంత వరకు శాస్త్రీయ ఆధారాలు లేవని వారున్నా, నమ్మేవారి సంఖ్యే ఎక్కువ ఉంటుంది. మన పురాతన గ్రంధాల్లో కూడా మనుషులు ఎలా జీవించాలి.? ఎలాంటి ఇంట్లో ఉండాలి.? లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలన్న విషయాలను స్పష్టంగా వివరించారు.

వీటిలో ఒకటి ఉదయం లేవగానే ఎలాంటి పనులు చేయకూడదు. మనుషులు జీవన విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉదయం 5 గంటలలోపే నిద్ర లేచే వారు. కానీ ఇప్పుడు రొటేషనల్‌ షిష్ట్స్‌, నైట్‌ షిఫ్ట్స్ ఇలా రకరకాల కారణాలతో జీవనం విధానం అస్తవ్యస్తమైంది. అయితే ఏ సమయంలో నిద్ర లేచినా సరే ఉదయం లేవగానే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా పనులు.? అవి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

* ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లో అద్దలో మొహం చూసుకోవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు ఎదురవుతాయని, సమస్యలు చుట్టుముడుతాయని చెబుతున్నారు. బెడ్‌ రూమ్‌లో అద్దం పెట్టుకోకూడదని వాస్తు నిపుణులు చెప్పేది కూడా ఇందుకే. ఉదయం లేవగానే అద్దంలో చూసుకోవడం వల్ల దుష్ఫ్రభావాలు ఉంటాయి కాబట్టే వాస్తులో ఆ నియమం పెట్టారని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లో నీడను చూడకూడదని పండితులు చెబుతున్నారు. తెల్లవారు జామున లేదా లైట్ వెలుతురులో కానీ తమ నీడను తాము చూసుకుంటే మంచిది కాదని చెబుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూడడమే కాకుండా నెగిటివ్‌ ఆలోచనలు పెరిగేలా చేస్తాయని నిపుణుల అభిప్రాయం.

* ఇక ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లో చూడకూడని వాటిలో వన్యప్రాణులు ఒకటి. వీటిని చూస్తే మానసిక ఆందోళన పెరిగి నెగిటివ్‌ ఆలోచనలు ఎక్కువుతాయని చెబుతున్నారు. ఒకవేళ బెడ్ రూమ్‌లో గోడలపై ఏవైనా వన్యప్రాణులకు సంబంధించిన సీనరీలు ఉంటే వెంటనే తీసేయాలని చెబుతున్నారు.

* ఇక చాలా మంది మహిళలు ఉదయం నిద్రలేవగానే రాత్రి తిన్న భోజనాలను కడగడానికి వెళ్తుంటారు. అయితే ఉదయం తలేవగానే రాత్రి తిన్న పాత్రలు చూడడం అశుభమని పండితులు చెబుతున్నారు. నిద్రలేచిన వెంటనే ఆ పాత్రలను చూస్తే నెగిటివ్‌ శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రి తిన్న పాత్రలను రాత్రే కడిగేసుకోవాలని, లేదంటే ఉదయం లేవగానే కాకుండా కాసేపటి తర్వాత పాత్రలను శుభ్రం చేయాలని పండితులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎంత వరకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న విషయాన్ని టీవీ9 ధృవీకరించడంలేదని లేదని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..