Telugu News Spiritual According to Garuda Puranam donating these items will lead to good fortune, know them
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేయడం వలన ఉత్తమ గతులు లభిస్తాయి.. అవి ఏమిటంటే
గరుడ పురాణం ప్రపంచ పోషకుడైన శ్రీ మహా విష్ణువు గురించి మాత్రమే కాదు.. మానవులు చేసే కర్మలు.. వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. గరుడ పురాణం అంటే చెడు పనులు.. నరకం శిక్షల గురించి తెలియజేసేది మాత్రమే కాదు.. మానవుడు చేసే మంచి పనులు.. దానధర్మాలు వాటి వలన కలిగే ఉత్తమ ఫలితాలు గురించి కూడా పేర్కొంది. అంటే ఇహ లోకంలో చేసే పుణ్య కార్యం.. పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా మనవ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసే దానానికి విశిష్ట ఫలితం దక్కుతుందని తెలుపుతుంది గరుడపురాణం
హిందూ సనాతన ధర్మంలో రామాయణ, మహాభారత గ్రంథాలతో పాటు వేదాలు, పురాణాలకు విశిష్ట స్థానం ఉంది. మన ప్రాచీన సనాతన హిందూధర్మ ఆచరణ విధానాలను, విశిష్టతలను చాటి చెప్పిన ఈ గ్రంథాలు మానవుడు ఏ విధంగా జీవించాలి.. ఎలా జీవించ కూడదో పేర్కొన్నాయి. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణం ప్రపంచ పోషకుడైన శ్రీ మహా విష్ణువు గురించి మాత్రమే కాదు.. మానవులు చేసే కర్మలు.. వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. గరుడ పురాణం అంటే చెడు పనులు.. నరకం శిక్షల గురించి తెలియజేసేది మాత్రమే కాదు.. మానవుడు చేసే మంచి పనులు.. దానధర్మాలు వాటి వలన కలిగే ఉత్తమ ఫలితాలు గురించి కూడా పేర్కొంది. అంటే ఇహ లోకంలో చేసే పుణ్య కార్యం.. పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా మనవ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసే దానానికి విశిష్ట ఫలితం దక్కుతుందని తెలుపుతుంది గరుడపురాణం
వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి కైలాసప్రాప్తి లభిస్తుంది.
గోవును దానం చేస్తే గోలోకంలో చోటు లభిస్తుంది. అదే ఆవు దూడను దానం చేసిన వారికీ శ్రీహరి నివాసం వైకుంఠవాసం లభిస్తుంది.
ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన వారికి తమకు నచ్చిన లోకంలో నివసిస్తారు.