Garuda Purana: మనిషి మరణించే ముందే ఏం కనిపిస్తాయి.? గరుడ పురాణం ఏం చెబుతోందంటే..

|

Dec 31, 2022 | 6:51 AM

పుట్టిన ప్రతీ వారికి మరణం తప్పదు. చావుకు సంబంధించి ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో విశ్వాసాన్ని కలిగి ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం చావుకు సంబంధించి గరుడ పురాణాన్ని నమ్ముతుంటారు. సనాతన ధర్మంలోని 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. మరణం, పునర్జన్మ, అంత్యక్రియలు వంటి విషయాలను ఇందులో వివరించారు. ఈ గరుడ పురాణాన్ని నమ్మేవారు..

Garuda Purana: మనిషి మరణించే ముందే ఏం కనిపిస్తాయి.? గరుడ పురాణం ఏం చెబుతోందంటే..
Garuda Purana
Follow us on

పుట్టిన ప్రతీ వారికి మరణం తప్పదు. చావుకు సంబంధించి ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో విశ్వాసాన్ని కలిగి ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం చావుకు సంబంధించి గరుడ పురాణాన్ని నమ్ముతుంటారు. సనాతన ధర్మంలోని 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. మరణం, పునర్జన్మ, అంత్యక్రియలు వంటి విషయాలను ఇందులో వివరించారు. ఈ గరుడ పురాణాన్ని నమ్మేవారు మనలో చాలా మందే ఉంటారు. కర్మ ఫలాలకు సంబంధించిన అంశాలను గరుడ పురాణంలో వివరించారు. ఈ జన్మలో ఏ తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారు లాంటి విషయాలను ఇందులో తెలిపారు. ఇదిలా ఉంటే గరుడ పురాణంలో మనిషిన మరణించే ముందే జరిగే విషయాలను సైతం ప్రస్తావించారు. ఇంతకీ మనిషి మరణం ముందు జరిగే మార్పులు ఏంటో ఇప్పుటు తెలుసుకుందాం..

* మనిషి కాసేపట్లో మరణిస్తాడనే సమయంలో కలలో కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. మనిషి కాసేపట్లో మరణిస్తాడనే ముందే కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తుందని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం దీనిని మరణానికి చిహ్నంగా భావిస్తారు.

* గరుడ పురాణం ప్రకారం.. మరణం సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి నీడ కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. ఆ వ్యక్తి నీటిలో లేదా నూనెలో తన నీడను చూసుకోలేడు.

ఇవి కూడా చదవండి

* మనిషి మరణానికి ముందు అతని ముక్కును చూసుకోలేడు. ఎంత ప్రయత్నించినా చనిపోయే ముందు ఆ వ్యక్తి తన ముక్కును తాను చూసుకోలేడు.

* మరణానికి ముందు మనిషి చేతి రేఖలు మసకబారుతాయి. మరికాసేపట్లో మరణిస్తారనే సమయంలో చేతిలో రేఖలను చూడలేరు.

* గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు వ్యక్తికి తన చుట్టూ ఆత్మలు కదులుతున్నట్లు భావన కలుగుతుంది. ఆ ఆత్మలు సదరు వ్యక్తి పూర్వీకుల ఆత్మలని చెబుతుంటారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కొన్ని గ్రంధాల్లో పేర్కొన్న వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..