చాణక్య నీతి: భార్యాభర్తల సంబంధం చిరకాలం ఉండాలంటే చాణక్య ఏం చెప్పాడో తెలుసా..?

|

Feb 13, 2022 | 9:43 AM

చాణక్య నీతి: చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి

చాణక్య నీతి: భార్యాభర్తల సంబంధం చిరకాలం ఉండాలంటే చాణక్య ఏం చెప్పాడో తెలుసా..?
Follow us on

చాణక్య నీతి: చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నంద వంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చాణక్యుడు నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం.

1. ప్రేమ

ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా ఉండాలంటే ప్రేమ ముఖ్యమని చెప్పాడు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు వారు చివరివరకు కలిసి ఉంటారని చెప్పాడు. దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడు బంధం బలహీనమవుతుందని పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొంటారని సూచించాడు.

2. అంకిత భావం

భార్య భర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. భాగస్వాములిద్దరికి కుటుంబంపై బాధ్యత, అంకిత భావం ఉండాలి. రిలేషన్ షిప్‌లో డెడికేషన్ సెన్స్ లేకపోతే ఆ రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నిలవలేదు. నిజానికి అంకిత భావమే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏ శక్తి వారిని విడదీయదని చాణక్య సూచించాడు.

3. ఒకరిపై ఒకరు గౌరవించుకోవడం

చాణక్య నీతి ప్రకారం వివాహ బంధంలో గౌరవం ముఖ్య పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోపోతే ఆ బంధం బలహీనమవుతుంది. గొవవలకు కారణం అవుతుంది. అందుకే ఒకరికొకరు ప్రేమతో పాటు గౌరవించుకోవాలని ఆచార్య తన నీతి గ్రంథంలో సూచించాడు.

4. స్వార్థం ఉండకూడదు..

ఆచార్య చాణక్యుడి ప్రకారం భార్యాభర్తల మధ్య ఎలాంటి స్వార్థం ఉండకూడదు. ఎందుకంటే స్వార్థం బంధాన్ని బలహీనపరుస్తుంది. వారు కలిసి సంతోషంగా ఉండలేరు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి. దీంతో బంధం బలపడడమే కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం చిగురిస్తుందని తెలిపాడు.

IPL 2022: రెండో రోజు వేలానికి రెడీగా ఉన్న ప్లేయర్స్.. ఇందులో ప్రధాన ఆటగాళ్లు ఎవరెవరంటే..?

Horoscope Today : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ రాశివారు జాగ్రత్త.. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం..

Vitamin B 9: విటమిన్ B9 మాత్రమే శరీరంలో ఈ పనిచేయగలదు.. అందుకోసం ఇవి తప్పనిసరి..?