Swapna Shastra: కలలో మీరు విషం తాగినట్లు కనిపించిందా.. కలవరపెట్టే కల మీ భవిష్యత్ కు ఒక హెచ్చరికే

కలలు చాలా కాలంగా ఆకర్షణకు మూలంగా ఉన్నాయి. మన ఉపచేతన మనస్సులోకి కిటికీల వంటివి కలలు. అంటే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని సార్లు మీ కలలు మీ మనసులోని ఆలోచనలకు దర్పణాలు వంటివి. అయితే మీరు విషం తాగినట్లు కలలు కన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఇది హెచ్చరిక సంకేతమా, మీ అంతర్గత గందరగోళానికి ప్రతిబింబమా లేదా మరింత లోతైన అర్ధం ఉందా? ఈ కలవరపెట్టే కల ఇతివృత్తం వెనుక ఉన్న అర్ధం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Swapna Shastra: కలలో మీరు విషం తాగినట్లు కనిపించిందా.. కలవరపెట్టే కల మీ భవిష్యత్ కు ఒక హెచ్చరికే
Swapna Shastra

Updated on: Jun 21, 2025 | 1:11 PM

నిద్రలో కలలు రావడం అనేది సహాయ ప్రక్రియ. గాఢనిద్రలో రకరకాల కలలు వస్తాయి. అయితే ఇలా కల వస్తున్న సమయంలో ఎప్పుడైనా ఆందోళనతో మేల్కొన్నారా..! ముఖ్యంగా మీరు విషం తాగుతున్నట్లు కల వెంటాడుతుందా? వాస్తవానికి ఇటువంటి కల మనసుని కలవరపెట్టేదిగా ఉన్నప్పటికీ.. ఈ కలకు స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఉంది. ఇటువంటి కల ఇతివృత్తం వెనుక ఉన్న సంకేత ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

కలలో విషం తాగినట్లు కనిపిస్తే
ఇటువంటి కల మీకు భవిష్యత్ లో ఏర్పడనున్న పరిస్థితిని హెచ్చరిస్తున్నట్లు అని స్వప్న శాస్త్రం పేర్కొంది. విషపూరిత సంబంధం, మోసపూరిత స్నేహం లేదా మీ శక్తిని, మనశ్శాంతిని హరించివేసే ప్రతికూల పని , ప్రతి కూల వాతావరణం వంటివి మీకు కనిపించని విధంగా.. నెమ్మది నెమ్మదిగా హానిని కలిగించానున్నాయని హెచ్చరిక.

ఇలాంటి కల మీ సొంత జీవిత నిర్ణయాలపై నియంత్రణ కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఇతరులు మీ మార్గంలో ఆధిపత్యం చేస్తుండవచ్చు. మీరు నిజాయితీ కోల్పోకుండ ఉండాలి. మీరు పరిస్థితులను సరిదిద్దుకోకపోతే ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇటువంటి కల తరచుగా ఒక సంకేత హెచ్చరికగా పనిచేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు మీ జీవితంలో రానున్న పరిస్థితులను తెలియజేస్తూ మీ అంతరంగం ఇక నుంచి వాస్తవికతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని. రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నట్లు లెక్క.

“మీరు సురక్షితంగా లేరని లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసించవద్దని కూడా ఈ కల సూచిస్తుంది. కలలోని విషప్రయోగం మీ నమ్మకం ధోరణి. రాజీపడడే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అని చెబుతున్నారు.

ఆధ్యాత్మిక దృక్కోణంలో కలలో విషం తీసుకోవడం అంటే మీ చక్రాలు మూసుకుపోయాయని లేదా మీ ప్రకాశం ప్రతికూల శక్తిని గ్రహించిందని కనుక ఆత్మ శుద్ధి, ఆధ్యాత్మిక పునఃసృష్టి అవసరమని హెచ్చరిక అట.

మీరు విషం తాగినట్లు కలలో కనిపిస్తే ఏమి చేయాలంటే

మీ శక్తి క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉప్పు వేసుకున్న నీటితో స్నానం చేయండి.

మీకు ఇష్టమైన దైవాన్ని తలచుకుంటూ ధ్యానం చేయండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు