Tirumala: భక్తులకు అందుబాటులో 2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. కావాలంటే ఇలా ఆర్డర్‌ చేయండి

|

Nov 28, 2022 | 10:29 AM

2023వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Tirumala: భక్తులకు అందుబాటులో 2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. కావాలంటే ఇలా ఆర్డర్‌ చేయండి
Ttd Diaries And Calendars
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) డైరీలు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చే భక్తులు కచ్చితంగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. అలాగే వివిధ దర్శనీయ ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ వీటిని విక్రయిస్తుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో 2023వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

పోస్ట్‌ ద్వారా..

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాల్సిన వారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లికేషన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇవి తపాలాశాఖ ద్వారా ఇంటివద్దకే చేరవేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు డీడీ కూడా తీసి పంపొచ్చు. ఇందుకోసం కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా నేషనల్‌ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కేటీ రోడ్డు, తిరుపతి’ అనే అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పంపుతారు. వీటికి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 99639 55585, 0877-2264209 నంబర్లను సంప్రదించాలని టీటీడీ సూచించింది.

ఇవి కూడా చదవండి

ధరలు ఇలా ఉన్నాయి..

  • 12 పేజీల క్యాలెండర్– రూ.130
  • డీలక్స్ డైరీ – రూ.150
  • చిన్న డైరీ– రూ.120
  • టేబుల్‌ టాప్‌ క్యాలెండర్– రూ.75
  • శ్రీవారి పెద్ద క్యాలెండర్– రూ.20
  • శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్– రూ.20
  • శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్– రూ.15
  • తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..